గాసిప్స్ న్యూస్

3 ఏళ్ళుగా హిట్ లేదు…కొత్త సినిమా శ్రీకారం కి షాకింగ్ OTT ఆఫర్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో హిట్ పడటం లేదు, రన్ రాజా రన్ తో మంచి హిట్ కొట్టి తర్వాత ఎక్స్ ప్రెస్ రాజా తో మరో హిట్ ని అందుకుని, శతమానం భవతి తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న శర్వానంద్ తర్వాత మహానుభావుడు తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. కానీ తర్వాతే పరిస్థితి మొత్తం మారిపోయింది.

చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా తన మార్కెట్ పై కూడా ఇది ఇంపాక్ట్ చూపడం మొదలు పెట్టింది. పడి పడి లేచే మనసు, రణ రంగం మరియు ఈ ఇయర్ వచ్చిన జాను సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటిని మించి ఒకటి…

నష్టాలను మిగిలించగా ఇప్పుడు శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో నిలవగా కరోనా వల్ల ఆగిపోగా ఈ సినిమా మరో 20% లోపు షూటింగ్ బాలెన్స్ ఉండగా ఇప్పుడు సినిమా కి డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లు దక్కుతున్నాయట.

సినిమా బడ్జెట్ ఎంత అనేది చెప్పకున్నా ఎక్కువే అయినా ఆ బడ్జెట్ కి ఏమాత్రం సంభందం లేకుండా 12-13 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్లు వస్తున్నాయని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. 25 కోట్ల రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ఇంపాక్ట్ పడటం తో ఇప్పుడు అందులో సగం రేంజ్ మార్కెట్ కి…

వచ్చాడు… దాంతో అదే రేంజ్ రేటు ని డైరెక్ట్ రిలీజ్ కి ఇస్తామని చెబుతూ ఉండటం తో యూనిట్ ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదట… ఏదైనా బెటర్ ఆఫర్ వస్తే అప్పుడు ఆలోచిస్తామని ఊరుకున్నారని తెలుస్తుంది, ఇక సినిమా బాలెన్స్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతుందని సమాచారం. అది అయ్యాక పరిస్థితులను బట్టి థియేటర్ రిలీజా లేదా డైరెక్ట్ రిలీజ్ గురించి ఆలోచిస్తారని అంటున్నారు.

Leave a Comment