న్యూస్ స్పెషల్

3 ఏళ్ళు అవుతున్నా ఫిదా సాధించిన రికార్డ్ అలానే ఉందిగా!!

రిలీజ్ అవ్వడం సైలెంట్ గా రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో ఫిదా సినిమా కూడా ఒకటి, అప్పటి వరకు కమర్షియల్ గా హిట్ కొట్టని వరుణ్ తేజ్ ని ఒక్క సినిమా తో మీడియం రేంజ్ హీరోల జాబితాలో ఎంటర్ అయ్యేలా చేసింది, సాయి పల్లవి ని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మార్చిన ఈ సినిమా శేఖర్ కమ్ముల నుండి వచ్చిన…

సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిన ఫిదా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల బిజినెస్ కి 48 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా మొదటి సారి…

21.31 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, ఇక మొదటి సారికి ఏమాత్రం తగ్గని విధంగా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కూడా ఈ సినిమా 18.6 రేటింగ్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపున సెకెండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న…

సినిమాగా చరిత్ర సృష్టించింది, సినిమా వచ్చి 3 ఏళ్ళు అయిపోతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా రాలేదు… రెండేళ్ళ క్రితం వచ్చిన గీత గోవిందం 17.16 రేటింగ్ ను అందుకోగా, ఈ ఇయర్ వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా 17.4 రేటింగ్ ను సొంతం చేసుకుని…

ఈ రికార్డ్ కు క్లోజ్ గా వచ్చినా అందుకోలేదు, ఇక ఈ రికార్డ్ ను కచ్చితంగా బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమాగా భావించిన అల వైకుంఠ పురంలో సెకెండ్ టైం టెలికాస్ట్ కి మొదటి సారి టెలికాస్ట్ తో పోల్చితే తక్కువ రేటింగ్ రావడం తో ఫిదా రికార్డ్ అలాగే కొనసాగుతుంది, మరి ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి..

Leave a Comment