న్యూస్ బాక్స్ ఆఫీస్

3 కోట్ల టార్గెట్….ఫస్ట్ డే మొత్తం మీద వచ్చింది ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ కంబ్యాక్ కొట్టి చాలా కాలమే అవుతుంది, రీసెంట్ ఔటింగ్ బంగారు బుల్లోడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నాసిరకం గానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మరోసారి అల్లరి నరేష్ కెరీర్ లో ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది. ఇలాంటి టైం లో తను నమ్మకం పెట్టుకున్న నాంది సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా స్టార్ట్ అవ్వడం చాలా నీరసంగా…

స్టార్ట్ అయినా కానీ తర్వాత తర్వాత పుంజుకుంటూ ఉన్నప్పటికీ ఈవినింగ్ నైట్ షోలకు వర్షాలు పలు చోట్ల ఇబ్బంది పెట్టడం తో మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోలేక పోయింది. అయినా కానీ ఉన్నంతలో మొదటి రోజు…

పోటి తీవ్రంగా ఉన్నప్పటికీ సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజును పూర్తీ చేసుకుంది. 50-60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అని అనుకున్నా సినిమా కొంచం తగ్గి 45 లక్షల షేర్ ని…

రెండు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 49 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఒకసారి టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 18L
👉Ceeded: 6L
👉UA: 5.2L
👉East: 5L
👉West: 2.2L
👉Guntur: 3.2L
👉Krishna: 3L
👉Nellore: 2L
AP-TG Total:- 0.45CR (0.72Cr Gross~)
KA+ROI – 2L
OS – 2L
Total WW: 0.49CR(0.80Cr Gross)
ఇదీ మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు. సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉంటడంతో ఇప్పుడు రెండో రోజు నుండి జోరు చూపే అవకాశం అయితే ఉంది.

మొత్తం మీద సినిమాను 2.7 కోట్లకు అమ్మగా సినిమా 3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 2.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. శని ఆది వారాల్లో సినిమా సాలిడ్ ట్రెండ్ ని చూపిస్తే కచ్చితంగా అల్లరి నరేష్ హిట్ కొట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

Leave a Comment