న్యూస్ బాక్స్ ఆఫీస్

3 డిసాస్టర్లు అయినా బాలయ్య 20.5 కోట్లతో మెంటల్ ఎక్కించాడు!

నట సింహం నందమూరి బాలకృష్ణ కి రీసెంట్ టైం పెద్దగా కలిసి రాలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 ఇయర్ లో చేసిన సినిమా చేసినట్లు డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా… బాలయ్య తో ఇప్పుడు హాట్రిక్ మూవీ చేస్తున్న బోయపాటి కూడా రీసెంట్ టైం లో క్లీన్ హిట్ కొట్టలేదు, కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాల బ్లాక్ బస్టర్ రిజల్ట్స్  వలన ఇప్పుడు…

వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ పై క్రేజ్ మరో లెవల్ లో ఉండగా ఇప్పుడు ఆ క్రేజ్ పవర్ ఎలా ఉందో సినిమా కేవలం ఒక షెడ్యూల్ షూటింగ్ ని మాత్రమే జరుపుకున్నా కానీ సినిమా కి ఇప్పుడు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రికార్డ్ లెవల్ లో…

అమ్ముడు పోయి క్రేజ్ పవర్ ని చూపింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఇప్పుడు జెమినీ టీవీ సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ కొన్నది ఎవరో అఫీషియల్ గా అప్ డేట్ చేయలేదు కానీ అమెజాన్ ప్రైమ్ కొంది అని టాక్ ఉంది, కాగా డిజిటల్ రైట్స్ రేటు….

బాలయ్య కెరీర్ లో రికార్డ్ లెవల్ లో 9 కోట్ల రేంజ్ రేటు దక్కించుకోగా… ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఏకంగా 11.5 కోట్ల రేటు కి జెమినీ టీవీ సొంతం చేసుకుందని సమాచారం. బోయపాటి మూవీస్ కి టెలివిజన్ లో ఎలాంటి సెన్సేషనల్ రేటింగ్స్ వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం…. వినయ విదేయ రామ టెలివిజన్ లో బ్లాక్ బస్టర్ అయింది.

అలాంటిది బాలయ్య బోయపాటి కాంబినేషన్ కాబట్టి మరింత రచ్చ జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రీసెంట్ గా మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో భారీ ఎత్తున రిలీజ్ కానుందని సమాచారం. డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కే 20.5 కోట్లు దక్కించుకున్న ఈ సినిమా ఇతర బిజినెస్ లు ఏ రేంజ్ లో జరుగుతాయో చూడాలి మరి.

Leave a Comment