న్యూస్ బాక్స్ ఆఫీస్

3 మూవీస్….బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్స్!!

ఈ దీపావళి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవ్వగా అందులో ఒకటి స్ట్రైట్ మూవీ కాగా మిగిలిన 2 సినిమాలు తమిళ్ డబ్బింగ్ మూవీస్. అయినా కానీ తెలుగు సినిమా కన్నా కూడా రెండు డబ్బింగ్ మూవీస్ కి థియేటర్స్ కౌంట్ ఓ రేంజ్ లో సొంతం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలు ఇప్పుడు దీపావళి హాలిడే రోజున తెలుగు రాష్ట్రాలలో ఎలా పెర్ఫార్మ్….

చేస్తాయి అన్నది ఆసక్తిగా మారగా ముందుగా సూపర్ స్టార్ రజినీ పెద్దన్న విషయానికి వస్తే భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ దూసుకు పోయే అవకాశం ఎంతైనా ఉంది.

ప్రెజెంట్ ట్రెండ్ ని ఫస్ట్ డే గ్రోత్ ని ఎస్టిమేట్ వేసి చెప్పాలి అంటే సినిమా 2 కోట్ల రేంజ్ షేర్ మినిమమ్ అందుకోవచ్చు, టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే 2.5 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేయోచ్చు. ఇక మారుతి మంచిరోజులొచ్చాయి సినిమా బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నప్పటికీ…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఈ సినిమాకి బాగా జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టాక్ బాగుంటే ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపెట్టే అవకాశం కూడా ఎంతైనా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 2 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక విశాల్ ఆర్యల లేటెస్ట్ మూవీ ఎనిమీ థియేటర్స్ బాగానే ఉన్నా మినిమం ఇంపాక్ట్ అయితే ఇప్పటి వరకు లేదు, కానీ టాక్ బాగుంటే సినిమా జోరు అందుకునే ఛాన్స్ ఉంది, ఓవరాల్ గా మొదటి రోజు 50-60 లక్షల రేంజ్ లో ఓపెన్ అవ్వొచ్చు, తర్వాత టాక్ బాగుంటే 80-1 కోటి రేంజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి ఈ 3 సినిమాలు అంచనాలను అందుకుంటాయో లేదో చూడాలి.

Leave a Comment