న్యూస్ బాక్స్ ఆఫీస్

3 రోజుల్లో బాహుబలి2 ఇండస్ట్రీ రికార్డ్ ఔట్ ఇన్ నైజాం!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఊచకోత కోసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించే కలెక్షన్స్ లో మేజర్ కలెక్షన్స్ నైజాం ఏరియా నుండే వస్తుండటం విశేషం, గట్టిగా చెప్పాలి అంటే మిగిలిన ఏరియాలు ఒకెత్తు అయితే ఒక్క నైజాం ఏరియా నే మరో ఎత్తుగా చెప్పుకోవాలి. సినిమా నైజాం లో మూడో రోజు 5.32 కోట్ల షేర్ ని అందుకుందట.

కానీ అందులో GST రిటర్న్ కలెక్షన్స్ కూడా యాడ్ అయ్యాయట. ఒక సారి నైజాం లో మూడు రోజుల సాహో కలెక్షన్స్ ని గమనిస్తే..
Day 1 – Nizam – 9.41Cr
Day 2 – Nizam – 5.21Cr
Day 3 – Nizam – 4.92Cr
3 Days Total – 19.54Cr+0.84Cr GST Returns= 20.38Cr* ఇదీ సినిమా భీభత్సం…

బాహుబలి 2 ఇక్కడ ఫస్ట్ డే 8.89 కోట్లు, రెండో రోజు 4.82 కోట్లు  మూడో రోజు 5.16 కోట్ల షేర్ ని అందుకోగా మూడు రోజుల్లో 18.87 కోట్ల షేర్ ని అందుకుంది, ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసిన సాహో ఆల్ టైం న్యూ ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

ఇక సినిమా మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా హిందీ లో సినిమా మూడో రోజు 29.48 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు అనుకున్న అంచనాల కన్నా కూడా ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉందని సమాచారం.

మినిమమ్ 10.5 కోట్ల నుండి 11 ఓట్ల కి ఏమాత్రం తక్కువ కాని కలెక్షన్స్ ని సినిమా మూడో రోజు అందుకునే అవకాశం ఉందని సమాచారం. మరి మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా మూడు రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!