న్యూస్ స్పెషల్

3 సార్లు లక్ష లైక్స్ తో యంగ్ టైగర్ మాస్ రికార్డ్!!

సోషల్ మీడియా లో లైక్స్, వ్యూస్, ట్వీట్స్ లాంటి కొత్త రికార్డు లు కూడా రీసెంట్ టైం లో ఎంటర్ అయ్యాయి, సెలెబ్రిటీల ట్వీట్స్ కి రీ ట్వీట్స్ ఎన్ని వచ్చాయి, అసలు ఏ ట్వీట్ కి ఎక్కువ లైక్స్ ఇప్పటి వరకు దక్కాయి లాంటివి కూడా ఫ్యాన్స్ కి ఇంపార్టంట్ గా మారింది సోషల్ మీడియా లో. కాగా ట్విట్టర్ లో టాలీవుడ్ సెలబ్రిటీ ల పరంగా మొట్ట మొదటి హైయెస్ట్ లైక్స్ ని…

సాధించిన ట్వీట్ గా ఎన్టీఆర్ జస్టిస్ ఫర్ దిశా ట్వీట్ కి వచ్చింది, తర్వాత ఇతర హీరోల ట్వీట్స్ కి కూడా క్రమంగా 1 లక్ష లైక్స్ అనేవి కామన్ గా వస్తు ఉండటం మొదలు అవ్వగా ప్రస్తుతం ఉన్న డేట్ వరకు టాలీవుడ్ సెలెబ్రిటీల ట్వీట్స్ లో….

ఎక్కువ సార్లు 1 లక్ష లైక్స్ ని అందుకున్న హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డ్ కొట్టాడు, మొత్తం మీద మూడు సార్లు ఎన్టీఆర్ వేసిన ట్వీట్స్ కి 1 లక్ష కి పైగా లైక్స్ దక్కాయి. రెండో సారి హోలీ టైం లో దిగిన ఫ్యామిలీ ఫోటో కి మూడో సారి….

రీసెంట్ బర్త్ డే కి విషెస్ చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ పెట్టిన ట్వీట్స్ కి 1 లక్ష కి పైగా లైక్స్ దక్కాయి. ఇక తర్వాత ప్లేసులలో పవన్ కళ్యాణ్ వేసిన 2 ట్వీట్స్ కి 1 లక్ష కి పైగా లైక్స్ దక్కగా మరో ట్వీట్ కి ఏకంగా 1 లక్షా 59 వేల కి పైగా లైక్స్ దక్కాయి. తర్వాత మహేష్ బాబు కి 2 సార్లు 1 లక్ష లైక్స్ ట్వీట్స్ దక్కగా…

రీసెంట్ గా రానా పెళ్లి సెట్ అయిన టైం లో వేసిన ట్వీట్స్ రెండింటికి 1 లక్ష కి పైగా లైక్స్ దక్కాయి.. అందులో ఒక ట్వీట్ కి 1 లక్షా 62 వేలకు పైగా లైక్స్ దక్కగా ప్రస్తుతం టాలీవుడ్ సెలెబ్రిటీల ట్వీట్స్ విషయం లో హైయెస్ట్ లైకుడ్ ట్వీట్ గా నిలిచింది, మొత్తం మీద ప్రస్తుతానికి ఎన్టీఆర్ మూడు లక్ష లైకుల ట్వీట్స్ తో టాప్ లో ఉన్నాడు…

Leave a Comment