న్యూస్ స్పెషల్

3 సార్లు 40….చరిత్రలో ఒకే ఒక్కడు…సామి శిఖరం!

కోలివుడ్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్, ఒకప్పుడు కేవలం కోలివుడ్ వరకే పరిమితం అయినా కానీ తనకంటూ క్రేజ్ ని ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సొంతం చేసుకున్న విజయ్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అవ్వడం తో ఇక్కడ కూడా మార్కెట్ ని ఎక్స్ పాండ్ చేసుకోగా తన సోషల్ మీడియా…

క్రేజ్ ఇక్కడ కూడా సాలిడ్ గా పెరుగుతూ వస్తుండగా తన లేటెస్ట్ మూవీ మాస్టర్ టీసర్ ను తమిళ్ వర్షన్ నే ఇక్కడ కూడా విరగబడి యూట్యూబ్ లో చూశారు, ఇక కోలివుడ్ లో తన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా టీసర్ లు ట్రైలర్ ల పరంగా కొత్త రికార్డులతో…

సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు మాస్టర్ టీసర్ 40 మిలియన్స్ మైలురాయిని అధిగమించి తక్కువ టైం లోనే ఈ మార్క్ ని అందుకుని రికార్డ్ సృష్టించగా మొత్తం మీద విజయ్ ఖాతాలో మూడో 40 మిలియన్ మార్క్ అందుకున్న టీసర్ గా సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

ఇది వరకు విజయ్ నటించిన మెర్సల్ మరియు సర్కార్ టీసర్ లు ఈ మార్క్ ని అందుకోగా అందులో మెర్సల్ టీసర్ ఏకంగా 50 మిలియన్స్ మార్క్ ని కూడా సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది, ఇప్పుడు ఆ రికార్డ్ వైపు దూసుకు పోతున్న మాస్టర్ టీసర్ తో విజయ్ ఇప్పుడు ఎక్కువ సార్లు 40 మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోగా…

ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశారు, కోలివుడ్ తరుపునే కాకుండా ఇండియా లో కూడా ఇలాంటి రికార్డ్ ను ఎవ్వరూ కూడా సొంతం చేసుకోలేదు అంటే విజయ్ క్రేజ్ పవర్ ని అర్ధం చేసుకోవచ్చు, ఇక లైక్స్ పరంగా ఈ టీసర్ ఇప్పటికే చరిత్ర సృష్టించగా 2.5 మిలియన్స్ లైక్స్ వైపు దూసుకు పోతూ అప్ కమింగ్ మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ని సెట్ చేసింది.

Leave a Comment