న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

3 సినిమాలు-750 కోట్లు…ఇదేమి రికార్డ్ సామి!!

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కెరీర్ లో ప్రస్తుతం పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్నాడు. ముఖ్యంగా తన రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీర లెవల్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ సంచలన రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి. ఈ క్రమం లో బాక్ టు బాక్ 200 కోట్ల సినిమాలతో సంచలనం సృష్టించిన విజయ్ తన లేటెస్ట్ మూడు సినిమాలతో కలిపి…

ఏకంగా 750 కోట్ల వసూళ్ళ ని రాబట్టి సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు. ముందుగా 2017 ఇయర్ లో రిలీజ్ అయిన మెర్సల్ సినిమా 114 కోట్ల బిజినెస్ ని సాధించగా ఫైనల్ రన్ లో ఏకంగా 128 కోట్ల షేర్ ని 249 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసింది.

ఇక 2018 ఇయర్ లో మురగదాస్ తో కలిసి చేసిన సర్కార్ సినిమా అయితే యావరేజ్ రివ్యూ లనే సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకుంది, కోలివుడ్ టాక్ ప్రకారం 134 కోట్ల బిజినెస్ కి సినిమా 139 కోట్ల షేర్ ని 260 కోట్ల లోపు గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందట.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బిగిల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 134 కోట్ల బిజినెస్ చేయగా 10 రోజులు పూర్తీ అయ్యే సరికే సినిమా ఏకంగా 129 కోట్ల షేర్ ని 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించగా మూడు సినిమాలు కలిపి ఏకంగా 760 కోట్ల వరకు గ్రాస్ ని క్రాస్ చేసింది..

ఇది నిజంగానే అల్టిమేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. రజినీ తర్వాత ఇప్పుడు కోలివుడ్ లో టాప్ లో ఉన్న హీరో విజయ్, తన పోటి దారులకు ఇప్పుడు అందనంత ఎత్తులో దూసుకు పోతున్న విజయ్ ఇప్పుడు బిగిల్ సినిమాతో ఫైనల్ రన్ లో 280 కోట్ల నుండి కుదిరితే 300 కోట్ల వరకు గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment