గాసిప్స్ న్యూస్

3 హిట్లు కొట్టిన హీరో…రిపబ్లిక్ కి ఊరమాస్ రేటు కి కొన్న జీ నెట్ వర్క్!!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని సూపర్ హిట్స్ తో మొదలు పెట్టగా తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో ఆల్ మోస్ట్ తనకి వచ్చిన మార్కెట్ ని కోల్పోయే స్టేజ్ కి వెళ్ళిన సాయి ధరం తేజ్ రెండేళ్ళ క్రితం తిరిగి బాక్ టు బాక్ హిట్స్ కొట్టడం మొదలు పెట్టాడు. చిత్రలహరి తో కంబ్యాక్ హిట్ కొట్టి ప్రతి రోజూ పండగే సినిమా తో…

ఇయర్ ఎండ్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ తర్వాత లాస్ట్ ఇయర్ సమ్మర్ కి సోలో బ్రతుకే సో బెటర్ తో రావాల్సింది కానీ ఫస్ట్ వేవ్ వలన ఆగి ఇయర్ ఎండ్ కి పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన…

మొదటి సినిమాగా నిలిచి మరో హిట్ ని సొంతం చేసుకుని హాట్రిక్ ని కంప్లీట్ చేయగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దేవకట్ట డైరెక్షన్ లో రిపబ్లిక్ సినిమా తో రాబోతున్నాడు సాయి ధరం తేజ్. కాగా ఈ సినిమా టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి…

మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా సినిమా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ సాలిడ్ గానే దక్కాయి, కానీ వాటికి నో చెబుతూ వచ్చిన ఈ సినిమా టీం కి జీ నెట్ వర్క్ నుండి అద్బుతమైన ఆఫర్ వచ్చింది కానీ అది గంపగుత్తుగా… అంటే సినిమా కంప్లీట్ రైట్స్ ని 34-35 కోట్లకి కొనడానికి ఓకే అంటూ చెప్పారు వాళ్ళు…

ఆ ఆఫర్ కి ముందు నో చెప్పినట్లే చెప్పగా ఈ లోపు రేటు ని పెంచి ఇప్పుడు 38 కోట్ల రేంజ్ లో భారీ ఆఫర్ ని ఇచ్చి సినిమా కంప్లీట్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారని అంటున్నారు. థియేటర్స్ లోనే సినిమా రిలీజ్ అవుతుందని, కానీ రెండు మూడు వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై మరిన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు.

Leave a Comment