న్యూస్ బాక్స్ ఆఫీస్

3.5 కోట్ల టార్గెట్…బంగారు బుల్లోడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవీ!!

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరో అల్లరి నరేష్ ఈ మధ్య ఫాం కోల్పోయి హిట్ కోసం కష్టపడుతున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితం అయతే దక్కడం లేదు. ఈ మధ్య సినిమాలు తీయడం తగ్గించిన అల్లరోడు, మహేష్ బాబు మహర్షి లో ఫ్రెండ్ రోల్ చేసిన తర్వాత ప్రేక్షకుల ముందుకు ఇప్పుడు బంగారు బుల్లోడు సినిమా తో అడుగు పెట్టాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ అంతంత మాత్రమే సొంతం అయ్యాయి. అల్లరి నరేష్ ఉన్న ఫాం దృశ్యా జనాలు మంచి ఓపెనింగ్స్ నే సినిమా కి ఇచ్చారు కానీ బిజినెస్ లెక్కలో చూసుకుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాల్సింది అని చెప్పాలి. ఇంకా అల్లరి నరేష్ మీద నమ్మకంతో…

సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో హైర్స్ కూడా పెట్టడం విశేషం, మొత్తం మీద హైర్స్ 21 లక్షల దాకా మొదటి రోజు కలెక్షన్స్ లో యాడ్ అయ్యాయని సమాచారం. దాంతో ఆ హైర్స్ కలిపి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 67 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 21L
👉Ceeded: 13L
👉UA: 11L
👉East: 6.1L
👉West: 4.2L
👉Guntur: 4.6L
👉Krishna: 4L
👉Nellore: 3.3L
AP-TG Total:- 0.67CR (1.1Cr Gross~)
KA+ROI: 2L
OS: 1L
Total:- 0.70Cr(1.15Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా ను మొత్తం మీద 3.2 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా… టోటల్ గా….

3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు మొత్తం మీద 70 లక్షల షేర్ ని రికవరీ చేసిన సినిమా ఇప్పుడు బాక్స్ అఫిఉస్ దగ్గర మొత్తం మీద మరో 2.8 కోట్ల రేంజ్ షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక రెండో రోజు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment