న్యూస్ బాక్స్ ఆఫీస్

3.5 కోట్ల టార్గెట్…4 రోజుల్లో వచ్చింది ఇది…పాపం అల్లరి నరేష్! ఇండస్ట్రీ రికార్డ్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సరైన హిట్ ని సొంతం చేసుకోలేక ఎప్పటి కప్పుడు వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటున్న అల్లరోడు నటించిన లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా నే అయినా అనుకోని కారణాల వలన ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.

కానీ సినిమా టాక్ యావరేజ్ లెవల్ లోనే ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ సాలిడ్ గా పడింది. రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు వీకెండ్ అయినా కానీ సినిమా పెద్దగా గ్రోత్ ని అయితే సాధించలేక పోయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3 వ రోజు…

కంప్లీట్ గా స్లో డౌన్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి 4 వ రోజు రిపబ్లిక్ డే హాలిడే దక్కినా కానీ ఏమాత్రం వాడుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 23 లక్షల రేంజ్ షేర్ ని మాత్రమె వసూల్ చేసి తీవ్రంగా నిరాశ పరిచే ప్రదర్శనని కనబరిచింది.

మొత్తం మీద సినిమా 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 44L
👉Ceeded: 28L
👉UA: 22L
👉East: 12L
👉West: 10L
👉Guntur: 13L
👉Krishna: 10L
👉Nellore: 7L
AP-TG Total:- 1.46CR (2.31Cr Gross~)
KA+ROI: 4L
OS: 2L
Total:- 1.52Cr(2.40Cr~ Gross)
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయిన సినిమా అల్లరి నరేష్ బ్యాడ్ ఫాం ని కంటిన్యూ చేసింది అని చెప్పాలి. సినిమాను టోటల్ గా 3.2 కోట్ల రేటు కి అమ్మగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.98 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపు అసాధ్యం కాబట్టి ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా పరుగును ముగించడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment