న్యూస్ బాక్స్ ఆఫీస్

30 కోట్ల షేర్ ఔట్…ఒక్క అడుగు దూరమే ఇక…ఇదీ మాస్ పవర్ అంటే!

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ రిలీజ్ కి ముందు ఎదురుకున్న అవరోధాలు అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ రోజున షోలు గడుస్తున్నా సినిమా థియేటర్స్ లో రాక పోవడం తో మొదటి రోజు భారీ కలెక్షన్స్ ని కోల్పోవాల్సి వచ్చింది, అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత అద్బుతమైన కలెక్షన్స్ ని సాధిస్తూ వెళ్ళగా తర్వాత సంక్రాంతి సినిమాల రాకతో..

స్లో అయినట్లు అనిపించినా తర్వాత కూడా క్రాక్ జోరు కంటిన్యూ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర వీక్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోయిన ఈ సినిమా రెండో వారం లో మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ప్రతిష్టాత్మక 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రవితేజ కెరీర్ లో రెండో క్లీన్ 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తె రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇది వరకు రవితేజ నటించిన సినిమాల్లో బలుపు 29 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత కొంత గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ సినిమా 31 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము దుమారం చేసింది. తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని…

ఎదురుకున్న రవితేజ ఇప్పుడు క్రాక్ తో కూడా మొదటి రోజు సజావుగా రిలీజ్ సొంతం చేసుకోక పోయినా థియేటర్స్ సంక్రాంతి పోరులో చాలినన్ని ఇవ్వక పోయినా కానీ 12 రోజుల్లోనే 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు రవితేజ కెరీర్ నంబర్ 1 మూవీ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. 2 వ వీక్ పూర్తీ అయ్యే టైం కి అది కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పాలి.

Leave a Comment