న్యూస్ బాక్స్ ఆఫీస్

30 కోట్ల షేర్++ కెరీర్ లో No.1

కెరీర్ మొదలు పెట్టి 10 ఏళ్ళు అవుతున్నా నికార్సయిన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తుండగా రెండేళ్ళ క్రితం రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నా అది సాలిడ్ విజయంగా చెప్పుకోలేమ్, కానీ ఇప్పుడు మజిలీ సినిమా తో కెరీర్ లో నికార్సయిన బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య. 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.

కాగా నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన మజిలీ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో 40 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తుంది, వర్కింగ్ డేస్ లో సినిమా బాగా హోల్డ్ చేస్తే ఈ మార్క్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదనే చెప్పాలి.

అలాగే మూడో వీక్ లో రిలీజ్ అవుతున్న జెర్సీ ని కూడా కొద్దిగా తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది, మొత్తం మీద మజిలీ సినిమా తో నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు 2019 సమ్మర్ మొదటి బ్లాక్ బస్టర్ ని టాలీవుడ్ కి అందించి సత్తా చాటుకున్నాడు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!