న్యూస్

30 న రిలీజ్ అవ్వాల్సిన సూర్య సినిమా ఆగిపోయింది…కారణం ఇదే!!

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు, తెలుగు లో ఆకాశం నీ హద్దుగా పేరు తో డబ్ అయిన ఈ సినిమాను సుమారు 65 కోట్ల భారీ రేటు కి సౌత్ లోనే హైయెస్ట్ డబ్బులు చెల్లించి అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకోగా… ఈ సినిమా ను ఈ నెల ఎండ్ 30 కి డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు నిర్మాతలు.

రిలీజ్ కి రెండు నెలల ముందే సినిమా డేట్ ని కన్ఫాం చేయగా మరో వారం లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా సినిమా రిలీజ్ ను ఆపేశారు సినిమా యూనిట్ వాళ్ళు. కాగా ఈ సినిమాను…

డెక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మధ్య కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద తెరకెక్కించిన చిత్రాల్లో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని నెగెటివ్ గా చూపించారనే నేపథ్యంలో సూర్య సినిమా మీద ఇప్పుడు అందరీ దృష్టి పడింది… సినిమాలో ఏమైనా మైనస్ లు ఉన్నాయా అని ఎదురు చూస్తుండగా….

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఈ సినిమాను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల సూర్య ప్రకటించారు. ఎన్వోసీని జారీ చేయడంలో ఆలస్యం జరగడంతో సినిమాను వాయిదా వేశారు. కాగా కొంత డిలే తర్వాత ఇప్పుడు సూర్య సినిమా లో సిబ్బందిని కానీ ఎయిర్ ఫోర్స్ ని కానీ…

ఎలాంటి నెగటివ్స్ ని చూపెట్టలేదని కన్ఫాం చేసి క్లీన్ సర్టిఫికేట్ ని జారీ చేశారు, అయినా కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ ఈ నెల ఎండ్ కి రావడం లేదని, మేకర్స్ దీపావళి కి సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్. కాగా దీనిపై మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది.

Leave a Comment