న్యూస్

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ట్రైలర్ రివ్యూ…బాగుంది!

ఒక్క పాటతో పాపులర్ అయ్యి తర్వాత సైలెంట్ అయిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా… లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా డైరెక్ట్ రిలీజ్ కోసం మంచి ఆఫర్లు ఎన్ని వచ్చినా నో చెబుతూ వచ్చి ఎట్టకేలకు ఇప్పుడు సినిమాను ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా…

లాంచ్ చేశారు…ట్రైలర్ చూస్తుంటే సినిమా ఆకట్టుకునేలా ఉందని పించడం ఖాయమని చెప్పొచ్చు… ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ జనరేషన్ లవ్ స్టొరీలు, రెండూ కూడా వేటికవే డిఫెరెంట్ గా ఉండగా ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు 30 రోజుల్లో ఎలా ప్రేమించుకున్నారు…

అన్న కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే పునర్జన్మల కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది అని కన్ఫాం అవ్వగా, ప్రజెంట్ జనరేషన్ లో హీరో హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి ఎలా కలిసారు అన్న కాన్సెప్ట్ తో సినిమా ఉంటుంది అని కన్ఫాం అయింది.

ట్రైలర్ మట్టుకు స్టార్ట్ అవ్వడం రొటీన్ గానే అనిపించినా తర్వాత ఆసక్తిగా సాగుతూ సగం అయ్యాక ఒక ట్విస్ట్ తో తర్వాత ప్రస్తుత కథతో కనెక్ట్ చేసి మొత్తం మీద టైటిల్ జెస్టిఫికేషన్ కి తగ్గట్లు 30 రోజుల్లో ఎలా ప్రేమించడం అనే కాన్సెప్ట్ తో కామెడీ ఎలిమెంట్స్ జోడించి బాగానే ముగించారు. ప్రదీప్ మరియు అమృతలు ఇద్దరూ కూడా బాగా మెప్పించాగా అనూప్ రూబెన్స్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్…

బాగున్నాయి… కామెడీ పెద్దగా ట్రైలర్ లో చూపెట్టలేదు కానీ సినిమాలో కామెడీ బాగుంటుంది అంటున్నారు. ఇక సినిమాను యువి క్రియేషన్ వాళ్ళు గీతా ఆర్ట్స్ వాళ్ళు కలిసి ఈ నెల 29 న రిలీజ్ చేయబోతున్నారు. మరి సినిమా అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

Leave a Comment