న్యూస్

30 లక్షలకు అమ్మితే పలాస 1978 TRP రేటింగ్ ఇది….కుమ్ముంది!!

కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆకట్టుకోలేక పోతాయి కానీ అవే సినిమాలు తిరిగి డిజిటల్ లోనో లేక టెలివిజన్ లో రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం మనం ఇప్పటికే పలు సందర్భాలలో చూశాం. 2020 ఇయర్ మార్చ్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓ చిన్న సినిమా ను రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆదరించలేదు, సినిమా టాక్ కూడా స్ప్రెడ్ అయ్యే లోపే…

ఫస్ట్ వేవ్ ఎంటర్ అవ్వడం తో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా పరుగును ఆపాల్సి వచ్చింది, కానీ తర్వాత వెంటనే డిజిటల్ లో రిలీజ్ అయిన పలాస 1978 కి అక్కడ డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది కానీ తర్వాత ఒక్క టిక్ టాక్ సాంగ్ తో…..

విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి అప్పటి నుండి సాలిడ్ వ్యూస్ అండ్ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రావడం మొదలు అయింది. దాంతో ఈ సినిమా ను టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ చేయడానికి రైట్స్ ని సుమారు 30 లక్షల రేంజ్ రేటు చెల్లించి…

స్టార్ మా ఛానెల్ శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకుంది. కాగా సినిమా ఈ మధ్యే మొట్ట మొదటి సారిగా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినా కానీ సినిమా కి మంచి రేటింగ్ దక్కింది టెలివిజన్ లో. మొదటి సారికి గాను ఈ సినిమా 5.02 TRP రేటింగ్ లభించడం విశేషం అనే చెప్పాలి. సినిమా కోసం ఛానెల్…

పెట్టిన రేటు కి ఆల్ రెడీ మొదటి సారే సాలిడ్ లాభాలను సొంతం చేసుకునేలా ఈ సినిమా సాలిడ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ టైం నుండి మరింత భారీ లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. వెండితెరపై సక్సెస్ మిస్ అయిన తర్వాత డిజిటల్ లో అలాగే ఇప్పుడు టెలివిజన్ లో మాత్రం సూపర్ సక్సెస్ అయింది ఈ సినిమా..

Leave a Comment