న్యూస్ బాక్స్ ఆఫీస్

32 కోట్ల సినిమా….6 రోజుల్లో దారుణమైన కలెక్షన్స్!

కోలివుడ్ లో ఫుల్ బిజీగా ఉండే నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ సేతుపతి అనే చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సినిమాలను చేస్తున్న విజయ్ సేతుపతి హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమాలను ఒప్పుకుంటూనే ఉన్నారు. కథలో దమ్ము ఉందా లేదా అనేది కూడా పట్టించుకోకుండా విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నారని దాని వల్ల అది సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై..

ఇంపాక్ట్ గట్టిగా చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు… లేటెస్ట్ గా విజయ్ సేతుపతి మరియు శృతి హాసన్ ల కాంబినేషన్ జగపతిబాబు విలన్ గా నటించిన మూవీ లాభం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి కెరీర్ లో మొట్ట మొదటి సారిగా తమిళ్ తో పాటు తెలుగు లో…

ఒకే టైం లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాను ఆల్ మోస్ట్ 32 కోట్ల బడ్జెట్ లో రూపొందించారని సమాచారం…. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రెండు రోజుల్లో 2.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు లో 10 లక్షల గ్రాస్ ని అందుకుంది.

ఇక ఇప్పుడు మొత్తం మీద 6 రోజులకు పూర్తీ చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 4.8 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని తమిళ్ అండ్ తెలుగు లో కలిపి సొంతం చేసుకుందని సమాచారం. తెలుగు లో 6 రోజుల్లో ఈ సినిమా 16 లక్షల మేర గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. తమిళ్ లో ఈ సినిమా ను 10 కోట్ల రేటు కి అమ్మారు…..

తెలుగు లో 80 లక్షల రేటు కి అమ్మారు… రెండు చోట్ల కూడా బిజినెస్ ను ఏ దశలో కూడా అందుకునే దిశగా సినిమా వెళ్ళాక పోవడం తో సినిమా డిసాస్టర్ అని తేల్చేశారు ట్రేడ్ వర్గాలు… ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా వల్ల భారీ నష్టాలు కొన్నవాళ్ళకి రావడం ఖాయమని అంటున్నారు. తెలుగు లో అయితే పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాబట్టలేక పోయింది ఈ సినిమా…

Leave a Comment