గాసిప్స్ న్యూస్

34 కోట్ల రేటు….కానీ మినిమమ్ బజ్ లేదు…2 ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ ఇది!

కొన్ని కొన్ని సార్లు స్టార్స్ నటించిన సినిమాలే అయినా కానీ ఆడియన్స్ లో ఎందుకనో క్రేజ్ అనేది చాలా తక్కువగా ఉంటూ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ రెడీ అవుతున్న తీరు కావొచ్చు లేక ఆ సినిమా ఆడియన్స్ లో అసలు ఇంటరెస్ట్ క్రియేట్ చేయడం లో విఫలం అవుతూ ఉండటం కావొచ్చు ఆడియన్స్ ఆ సినిమాను పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం ఇలాంటి ఫేస్ లోనే ఉంది నితిన్ లేటెస్ట్ మూవీ మాస్ట్రో…

హిందీ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన అంధధూన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది, ఎక్స్ పెరి మెంటల్ మూవీనే అయినా అక్కడ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో థ్రిల్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాను తెలుగు లో నితిన్, నభా నటేష్ మరియు తమన్నాల…

కాంబినేషన్ లో రీమేక్ చేస్తూ ఉండగా సినిమా టీసర్ అలాగే రెండు సాంగ్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయి కానీ అవి ఏమాత్రం సినిమా పై ఇంపాక్ట్ ని క్రియేట్ అయితే చేయలేక పోయాయి. దానికి నితిన్ రీసెంట్ 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వడం ఒక కారణం అని చెప్పాలి.

ఇక ఈ సినిమాను ఆల్ మోస్ట్ 34 కోట్ల రేంజ్ రేటు పెట్టి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు. ఈ నెలలోనే కుదిరితే సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నా అసలు మార్కెట్ లో ఈ సినిమా ఊసే వినిపించడం లేదు….. అంత రేటు పలికిన సినిమా కి ప్రమోషన్స్…

ఇంకా అనుకున్న రేంజ్ లో స్టార్ట్ చేయలేదు. సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ తర్వాత బజ్ ఓ రేంజ్ లో పెరుగుతుంది అన్న ధీమాతో టీం ఉన్నారు కానీ అది త్వరగా చేయడం బెటర్ అని విశ్లేషకులు అనుకుంటున్నారు. సినిమా కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకుంటున్న ఈ సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసి అందరి మెప్పు పొందితే నితిన్ ఫ్యూచర్ మూవీస్ కి అది అంతలా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు.

Leave a Comment