Uncategorized న్యూస్ బాక్స్ ఆఫీస్

34.5 కోట్ల రేటు….2 నెలల్లో వి మూవీ వ్యూస్ &కలెక్షన్స్ తెలిస్తే షాక్!

నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వి ది మూవీ ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా నే అయినా కానీ కరోనా వలన అది కుదరక సినిమా అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో వచ్చింది.

అయినా కానీ సినిమా అన్ని భాషల్లో కలిపి అల్టిమేట్ వ్యూస్ ని అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకున్నా కానీ కొన్న రేటు ప్రకారం చూసుకుంటే మాత్రం వాళ్లకి నిరాశే ఎదురయ్యింది ఈ సినిమా వలన. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ను సుమారు 34.5 కోట్ల…

రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా మొదటి నెలకి గాను సినిమా ఓవరాల్ గా 1.5 యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఇప్పుడు రెండు నెలలు పూర్తీ అయ్యే సరికి సినిమా సాధించిన ఓవరాల్ వ్యూస్ లెక్కలు కూడా బయటకి రిలీజ్ అయ్యి చక్కర్లు కొడుతున్నాయి.

ఆ లెక్కల ప్రకారం రెండో నెలలో సినిమా కి మొత్తం మీద 7 లక్షల 80 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. అంటే మొత్తం మీద 2 నెలలు పూర్తీ అయ్యే సరికి అమెజాన్ ప్రైమ్ లో అన్ని వర్షన్స్ కలిపి యూనిక్ వ్యూస్ మొత్తం మీద 2.28 మిలియన్ యూనిక్ వ్యూస్ ని సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఈ వ్యూస్ కి సినిమాకి…

ఎంత కలెక్షన్స్ వచ్చి ఉంటాయి అన్నది అంచనా వేస్తె… అమెజాన్ ప్రైమ్ ఒక నెల సబ్ స్క్రిప్షన్ రేటు 129 కాగా అదే సినిమా ఒక టికెట్ రేటుగా భావిస్తే 2.28 మిలియన్ వ్యూస్ కి 129 టికెట్ రేటు తో 29.40 కోట్ల దాకా రికవరీ అయ్యి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. ఈ లెక్కలు నిజం అనుకుంటే సినిమా మరో నెలలో అమెజాన్ కి ప్రాఫిట్స్ కూడా తెచ్చి పెట్టె అవకాశం ఉందని చెప్పాలి.

Leave a Comment