టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

35 కోట్ల సినిమా…తమిళ్ లో వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!!

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు, ఈ మధ్య కాలంలో ఒకటి రెండు ఫ్లాఫ్స్ తర్వాత భారీ బడ్జెట్ తో బాక్ టు బాక్ సినిమాలు చేసిన విశాల్ యాక్షన్ మూవీ డిసాస్టర్ రిజల్ట్ తర్వాత చేసిన సినిమా చక్ర.. ఆల్ మోస్ట్ ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ లో సుమారు 35 కోట్ల పెట్టుబడి తో నిర్మాణం అవ్వగా డైరెక్ట్ రిలీజ్…

కోసం ముందు మంచి ఆఫర్స్ వచ్చినా నో చెప్పి తర్వాత థియేటర్స్ లో రిలీజ్ చేశారు, తమిళ్ తో పాటు తెలుగు లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ 5.4 కోట్ల టార్గెట్ కి 3.24 కోట్ల షేర్ ని సాధించి 2.16 కోట్ల లాస్ తో ఫ్లాఫ్ గా నిలిచింది.

ఇక తమిళ్ వర్షన్ విషయానికి వస్తే… బిజినెస్ లెక్కలు తెలియలేదు కానీ సినిమా టోటల్ రన్ లో తమిళనాడు లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క 12.2 కోట్ల వరకు ఉందని సమాచారం. ఓవర్సీస్ లో పట్టుమని 50 లక్షలు కూడా సాధించని ఈ సినిమా… టోటల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా లో…

మరో 40 లక్షల గ్రాస్ ను సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అన్ని చోట్లా కలుపుకుని 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అలాగే 10.2 కోట్ల మేర షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. బిజినెస్ లెక్కలు రివీల్ చేయలేదు కాబట్టి బడ్జెట్ పరంగా చూసుకున్నా కానీ 35 కోట్ల ఓవరాల్ బడ్జెట్ కి…

10.2 కోట్లు రికవరీ చేసి దిమ్మతిరిగే షాకిచ్చింది చక్ర సినిమా. దాంతో విశాల్ ఖాతాలో బాక్ టు బాక్ భారీ డిసాస్టర్ మూవీస్ గా యాక్షన్ తో పాటు ఈ సినిమా చక్ర మూవీ కూడా భారీ నష్టాలను మిగిలించింది. డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసి ఉంటే సినిమా కి మంచి రెస్పాన్స్ తో పాటు మంచి రేటు కూడా సొంతం అయ్యి ఉండేదేమో…

Leave a Comment