గాసిప్స్ న్యూస్

35 కోట్ల సినిమా ఫ్లాఫ్….70 కోట్ల సినిమా కి నో చెప్పిన దిల్ రాజు!!

నిర్మాత దిల్ రాజు సినిమాల నిర్మాణం విషయం లో పక్కాగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే, ఒక సినిమా బడ్జెట్ విషయం లో కానీ రిలీజ్ విషయం లో కానీ ఆయన ఇన్వాల్వ్ మెంట్ చాలా ఉంటుంది, పరిమిత బడ్జెట్ లలోనే సినిమా లను తీసి మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న దిల్ రాజు కూడా అడపా దడపా కొన్ని బిగ్ మూవీస్ చేసి నష్టాలను సొంతం చేసుకున్నారు.

అందుకే ఆ తప్పులు రిపీట్ అవ్వకూడదు అని సినిమాల బడ్జెట్ విషయం లో గట్టిగా ఉంటారు, అయినా కానీ కొన్ని సార్లు బడ్జెట్ అంచనాలను మించి పోతూనే ఉంటుంది, లేటెస్ట్ గా దిల్ రాజు నిర్మాణం లో నాని 25 వ సినిమా వి ది మూవీ ని….

సుమారు 25 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తీయాలి అనుకున్నారు, కానీ బడ్జెట్ మొత్తం మీద 35 కోట్ల దాకా వెళ్ళింది, కానీ సినిమా క్వాలిటీ అదిరింది కానీ సినిమా కంటెంట్ ఆకట్టుకునేలా లేక పోవడం తో ఆడియన్స్ రిజక్ట్ చేశారు కానీ OTT కి భారీ రేటు కి అమ్మడం వలన అందరూ సేఫ్ అయ్యారు.

ఈ సినిమా కథ చెప్పినప్పుడే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ఓ భారీ సినిమా కాన్సెప్ట్ అండ్ బడ్జెట్ ని చెప్పారట. వి ది మూవీ సక్సెస్ ని బట్టి ఆ సినిమా ఉంటుందని దిల్ రాజు చెప్పగా ఇప్పుడు వి మూవీ రిజల్ట్ రావడం తో తన వంతుగా డైరెక్టర్ మరోసారి దిల్ రాజు ని అప్రోచ్ అయ్యి ఈ సినిమా గురించి చెప్పగా…

బడ్జెట్ 70 కోట్ల రేంజ్ లో ఉంటుంది అని చెప్పడం తో దిల్ రాజు ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ మూవీ వద్దు మీ స్టైల్ లో ఒక లవ్ స్టొరీ లేదా ఎంటర్ టైనర్ కథని చెప్పండి అది చేద్దాం అని చెప్పారట. దాంతో ఆ భారీ బడ్జెట్ మూవీ ని డైరెక్టర్ ఇప్పుడు పక్కకు పెట్టారని టాక్ ఉంది, దిల్ రాజు మళ్ళీ అంత బడ్జెట్ తో రిస్క్ చేయడం ఇష్టం లేక ఇలా చెప్పారని కూడా ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.

Leave a Comment