న్యూస్

35 కోట్ల సినిమా…షాకింగ్ లో రేటు…ఫైనల్ గా ట్విస్ట్ ఇచ్చిన హీరో!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు, తమిళ్ తో పాటు తెలుగు మార్కెట్ ని ఎప్పటికప్పుడు స్టడీగా మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న విశాల్ రీసెంట్ టైం లో మళ్ళీ ఫాం కోల్పోయాడు… తమిళ్ తెలుగు లో డిటెక్టివ్, అభిమన్యుడు, పందెం కోడి 2 లాంటి సినిమాలతో హిట్స్ కొట్టినా తర్వాత అయోగ్య మరియు యాక్షన్ సినిమాలతో…

బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాడు… కాగా లాస్ట్ ఇయర్ విశాల్ చేసిన చక్ర సినిమా ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అనేక ఇబ్బందులు ఎదురుకున్న సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా థియేట్రికల్ రిలీజ్ కష్టం అవ్వడంతో డిజిటల్ రిలీజ్ కి…

ట్రై చేసినా 45 కోట్ల రేంజ్ లో రేటు ఎక్స్ పెర్ట్ చేస్తే రేటు తగ్గి తగ్గీ 25 కోట్ల రేంజ్ కి చేరగా మధ్యలో పాత సినిమా నష్టాల గొడవతో సినిమా పై క్రేజ్ మరింతగా తగ్గింది, దాంతో రేటు కి మరింత తగ్గించడానికి OTT యాప్స్ సిద్ధం అవ్వగా ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్…

అవ్వడం తో వాళ్ళందరికీ షాక్ ఇస్తూ చక్ర సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్ధం అయ్యాడు విశాల్… కాగా చక్ర సినిమాను ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఫిబ్రవరి 12 న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు విశాల్. రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చి సినిమా రిలీజ్ ను కన్ఫాం చేయగా ఇక డిజిటల్ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రన్ తర్వాతే ఉంటుంది అని అంటున్నారు.

పాత అప్పులను తీర్పి, ఇబ్బందులను ఎదురుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తో మంచి కంబ్యాక్ ఇస్తానన్న నమ్మకంతో ఉన్నాడు విశాల్. సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా ఇతర భాషల రిలీజ్ ఇంకా తేలాల్సి ఉంది. మరి ఈ సినిమా తో విశాల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

Leave a Comment