గాసిప్స్ న్యూస్

350 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ తో గోపీచంద్ మూవీ!!

మాస్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఒకరు. ఇప్పుడు సరైన సినిమా పడక మార్కెట్ మొత్తం కోల్పోయిన గోపీచంద్ తో ఇప్పుడు కూడా సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ అలాగే నిర్మాతలు కూడా సిద్ధంగా ఉండటం విశేషం… ఇక తన అప్ కమింగ్ మూవీస్ లిస్టు మెల్లి మెల్లిగా సాలిడ్ గా మారుతూ పోతుంది. ప్రస్తుతం సీటి మార్ తర్వాత మారుతి డైరెక్షన్ లో మూవీ, తర్వాత….

తేజ డైరక్షన్ లో కొత్త సినిమా చేయబోతున్న గోపీచంద్… వీటితో పాటు మరో బిగ్ మూవీ చేసే ఛాన్స్ గట్టిగా ఉందని అంటున్నారు. టాలీవుడ్ లో రన్ రాజా రన్ తో తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టి రెండో సినిమా కే ఏకంగా…

పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఇప్పుడు కొత్త సినిమా చేసే అవకాశం గట్టిగా ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. సుజీత్ మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ కమిట్ అయినా ఆ ప్రాజెక్ట్ నుండి ఆల్ మోస్ట్ తప్పుకోవడంతో.. తనకి హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ లో…

ఇప్పుడు తిరిగి వెళుతున్నాడట.. కాగా తన దగ్గర ఉన్న కథ కి అయితే గోపీచంద్ లేదా శర్వానంద్ లలో ఒకరితో సినిమా కమిట్ అయ్యే అవకాశం ఉండగా గోపీచంద్ తో సుజిత్ సినిమా ఉండే అవకాశం కొంచం ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపీచంద్ తో యువి క్రియేషన్స్ లో ఇది వరకే జిల్ సినిమా వచ్చింది.

ఆ సినిమాతో సాలిడ్ హిట్ కన్ఫాం అనుకుంటే యావరేజ్ రిజల్ట్ దక్కింది… దాంతో యువి వాళ్ళు గోపీచంద్ తో కచ్చితంగా ఓ భారీ మూవీ తీయాలి అని ఎప్పుడో ఫిక్స్ అవ్వగా అన్నీ సెట్ అయితే ఇప్పుడు 350 కోట్లతో సాహో తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ తో కలిసి గోపీచంద్ తో మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ చేసే అవకాశం ఎంతైనా ఉందని టాక్ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి…

Leave a Comment