గాసిప్స్ న్యూస్

36 కోట్లు అనుకుంటే ఇదెక్కడి మాస్ రా బాబు…రేటు ఇంకా పెంచారుగా!

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నారప్ప పై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి, కానీ థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ డిసైడ్ చేశారు. సినిమా కి డబ్బులు పెట్టి తీసింది నిర్మాతలే కాబట్టి ఎక్కడ ఎలా రిలీజ్ చేసుకోవాలో అన్నది కూడా వాళ్ళ ఇష్టానికే వదిలేయాలి అంటూ సినిమా నిర్మాత సురేష్ బాబు డైరెక్ట్ గానే చెప్పారు.

దాంతో సినిమాను 36 కోట్ల భారీ రేటు కి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొన్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేయాల్సిన టైం లో ప్రభుత్వం అక్టోబర్ వరకు కూడా కొత్త సినిమాలు ఏమి కూడా డిజిటల్ లో రిలీజ్ చేయకూడదు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.

దాంతో ఇక నారప్ప డిజిటల్ రిలీజ్ ఉండదని వార్తలు రాగా తర్వాత ప్రభుత్వం తో మాట్లాడుకున్న నిర్మాతలు ఇప్పటి వరకు అగ్రిమెంట్స్ జరిగినవి కాకుండా కొత్త సినిమాలు ఈ రూల్ పాటించాలని చెప్పగా ఎందుకనో మళ్ళీ థియేటర్స్ లోనే నారప్ప ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రాగా…

అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి ఈ విషయం చెప్పడం వాళ్ళు ఆల్ రెడీ పబ్లిసిటీ పనులు మొదలు పెట్టడం తో వెనక్కి తగ్గకుండా మరో 4 కోట్లు అధికంగా ఇస్తామని సినిమా ను డిజిటల్ లోనే రిలీజ్ చేయాలనీ కోరారు. దాంతో నిర్మాతలు ఒప్పుకుని ఇప్పుడు 20 న సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. 36 కోట్లే అద్బుతం అనుకుంటే ఏకంగా లెక్క…

ఇప్పుడు 40 కోట్ల మార్క్ ని అందుకుని డీల్ ని క్లోజ్ చేశారని తెలుస్తుంది. దాంతో మేకర్స్ మరో 4 కోట్లు అధికంగా లభించినట్లు అయింది. ఇక సినిమా 20 న రిలీజ్ కానుండగా ఆడియన్స్ ను ఒరిజినల్ కి మించి మెప్పిస్తుందా లేదా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది.. సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక.

Leave a Comment