న్యూస్ బాక్స్ ఆఫీస్

36.15 కోట్ల బిజినెస్….2 వారాల్లో వచ్చింది ఇది…ఇండియాలో రికార్డ్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా తెలుగులో సూపర్ సాలిడ్ గా 2 వారాలను పూర్తీ చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది, 14 వ రోజు సినిమా 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, దాంతో సినిమా 2 వారాల తెలుగు కలెక్షన్స్ 2.02 కోట్లు ఉండగా గ్రాస్ 3.55 కోట్ల వరకు ఉంది, ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

👉Nizam: 58L
👉Ceeded: 31L
👉UA: 31L
👉East: 19L
👉West: 14L
👉Guntur: 19L
👉Krishna: 21L
👉Nellore: 9L
AP-TG Total:- 2.02CR(3.55CR~ Gross)
తమిళనాడులో 59.3 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమా కర్ణాటకలో 2.8 కోట్ల గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షల గ్రాస్ ను అందుకుంది… ఓవర్సీస్ లో 12.3 కోట్ల గ్రాస్ ని అందుకోగా…

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 78.7 కోట్ల గ్రాస్ ను అందుకోగా టోటల్ షేర్ 40 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందట. సినిమా టోటల్ బిజినెస్ 36.15 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, ఇండియా లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా సెకెండ్ వేవ్ తర్వాత సంచలనం సృష్టించింది ఈ సినిమా..

Leave a Comment