న్యూస్ బాక్స్ ఆఫీస్

38 కోట్ల మాస్…19 కోట్ల టార్గెట్…10 రోజుల్లో వచ్చింది ఇది…!!

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది. 10 వ రోజు ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఉండటం తో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా అది మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదు. దాంతో సినిమా 9 వ రోజు కన్నా డీసెంట్ గ్రోత్ ని….

బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెట్టి దుమ్ము దుమారం చేసింది… సినిమా 9 వ రోజు తో పోల్చితే 10 వ రోజన 35-40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే మ్యాచ్ వలన ఎఫెక్ట్ కూడా ఉంది కదా డౌట్ అనుకున్నాం కానీ ఆ ఇంపాక్ట్ కొద్ది వరకే పడి…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజు 50 లక్షల మార్క్ ని కూడా అధిగమించి 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 38 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషం. టోటల్ గా సినిమా 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 7.35Cr
👉Ceeded: 3.90Cr
👉UA: 2.28Cr
👉East: 1.18Cr
👉West: 95L
👉Guntur: 1.34Cr
👉Krishna: 1.07Cr
👉Nellore: 80L
AP-TG Total:- 18.87CR(31.05CR Gross)
Ka+ROI: 1.45Cr
OS – 2.34Cr
Total WW: 22.66CR(38CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమా బిజినెస్…

18.5 కోట్లు కాగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 3.66 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి.

Leave a Comment