న్యూస్ బాక్స్ ఆఫీస్

3rd డే….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…..ఈ రేంజ్ దెబ్బ అంచనా వేయలేదు!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఏమాత్రం బాలేదు అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో అన్ని సినిమాలు కూడా ఓపెనింగ్ డే నుండే అంచనాలను అందుకోలేక పోతున్నాయి. స్ట్రైట్ మూవీ మంచి రోజులు వచ్చాయి సాధించిన బిజినెస్ కి వస్తున్న కలెక్షన్స్ చాలా తక్కువగా ఉండగా పెద్దన్న పరిస్థితి మరీ కష్టంగా మారగా ఇప్పుడు ఎనిమీ సినిమా విషయం లో కూడా ఇదే జరుగుతుంది అని చెప్పాలి.

మూడు సినిమాలు మూడో రోజు ఎంటర్ అవ్వగా మంచి రోజులు వచ్చాయి సినిమా 3 వ రోజు 25-30 లక్షల లోపు కలెక్షన్స్ ని అందుకునేలా ఉండగా పెద్దన్న సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 40-45 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక విశాల్ ఆర్యల ఎనిమీ సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 25-28 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా మూడు సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం గ్రోత్ ని చూపెట్టొచ్చు. కానీ సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి ఈ కలెక్షన్స్ ఏ కోశానా సరిపోవు అనే చెప్పాలి.

Leave a Comment