న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

4 ఏళ్లుగా హిట్ లేకున్నా నిర్మాతకి ప్రాఫిట్స్ ఇచ్చిన రాజ్ తరుణ్…ఒరేయ్ బుజ్జిగా టోటల్ బిజినెస్ ఇదే!

యంగ్ హీరో రాజ్ తరుణ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదట్లో కలిసి వచ్చినంతగా తర్వాత కలిసి రావడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టలేక పోయాడు. ఇలాంటి టైం లో కామెడీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా తో తన లక్ ని పరీక్షించు కోవాలని చూసినా కరోనా వలన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అవుతూ…

మంచి OTT ఆఫర్లు వచ్చినా అప్పుడు నో చెప్పి తర్వాత మామూలు రేటుకే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. సినిమా చాలా వరకు నార్మల్ రివ్యూ లే దక్కినప్పటికీ కూడా వ్యూస్ పరంగా మాత్రం అద్బుతమైన వ్యూస్ ని సొంతం చేసుకుని OTT హిట్ గా నిలిచింది.

4 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టక పోయినా కానీ రాజ్ తరుణ్ ఈ సినిమా తో కూడా నిర్మాతకి ఫుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టాడు. ఒక సారి సినిమా బడ్జెట్ అండ్ టోటల్ బిజినెస్ ను గమనిస్తే… సినిమాను మొత్తం మీద 3 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకేక్కించగా….

సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ రేటు 4 కోట్లు పలికింది, తర్వాత మ్యూజిక్ రైట్స్ కింద సినిమా 15 లక్షల దాకా రేటు పలకగా తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ కింద 1.8 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకుంది, ఇక సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 65 లక్షల దాకా రేటు దక్కించుకోగా… మొత్తం మీద బిజినెస్ 6.6 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది…

అంటే సినిమా మీద నిర్మాత పెట్టిన 3 కోట్లకు పైగా బడ్జెట్ కి 6.6 కోట్ల దాకా బిజినెస్ చేసిన సినిమా 3.6 కోట్ల మేర ప్రాఫిట్ ని నిర్మాతకి తెప్పించి పెట్టింది. 4 ఏళ్లుగా హిట్ లేకున్నా రాజ్ తరుణ్ సినిమా నిర్మాతకి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టడం విశేషం అనే చెప్పాలి. ముందు వచ్చిన 7.5 కోట్ల ఆఫర్ ని ఒప్పుకుని ఉంటే ప్రాఫిట్స్ డబుల్ రేంజ్ లో దక్కి ఉండేవి…

Leave a Comment