న్యూస్

4 ఏళ్ల క్రితం మూవీ… 35 లక్షల రేటు…TRP వచ్చింది ఇది!

లాక్ డౌన్ టైం నుండి వేసిన సినిమాలే వేస్తూ ఉండటం తో కొత్త సినిమాలు లేక మళ్ళీ అవే పాత సినిమాలను రిపీట్ చేస్తున్న టెలివిజన్ ఛానెల్స్ లో స్టార్ మా ఛానెల్ మాత్రం కొత్త రూట్ ని ఫాలో అవుతూ ఇది వరకు రిలీజ్ అయ్యి టెలికాస్ట్ కానీ సినిమాలను ఎంచుకుని ఎంతో కొంత రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని కొని ఆ సినిమాలను టెలికాస్ట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా ఈ రూట్ లో కొత్త పాత అని తేడా లేకుండా పెండింగ్ లో ఉన్న చాలా సినిమా ల శాటిలైట్ రైట్స్ ని కొని మంచి TRP రేటింగ్స్ ని సొంతం చేసుకున్న స్టార్ మా రీసెంట్ గా మరో సినిమా ను…

కూడా ఈ పద్దతి లోనే కొని రీసెంట్ గా టెలికాస్ట్ చేసింది… ఈ పద్దతిలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు… శ్రీ విష్ణు మెయిన్ రోల్ లో కీలక పాత్రలో నారా రోహిత్ కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు 2016 లో వచ్చిన విషయం తెలిసిందే.

ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అప్పటికి నారా రోహిత్ ఫ్లాఫ్స్ లో పీక్స్ లో ఉండటం శ్రీ విష్ణు కి కూడా పెద్దగా మార్కెట్ లేక పోవడం తో టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేక ఫ్లాఫ్ రిజల్ట్ ని సొంతం చేసుకుని పరుగు ముగించింది.

శాటిలైట్ రైట్స్ ఎవ్వరూ కొనని ఈ సినిమా ను స్టార్ మా రీసెంట్ గా 35 లక్షల రేంజ్ రేటు కి కొని రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 2.99 TRP రేటింగ్ దక్కింది. ఓవరాల్ గా రేటు ప్రకారం చూసుకుంటే ఇది డీసెంట్ రేటింగ్ అని చెప్పాలి. మరో సారి టెలికాస్ట్ అయితే ఛానెల్ కి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది…

Leave a Comment