గాసిప్స్ న్యూస్

4 ఏళ్ళుగా ఆగిన సినిమా…మళ్ళీ పెద్ద అడ్డంకి…!!

యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ లో ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్నప్పటికీ కూడా వరుస పెట్టి తనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు, అన్నీ సినిమాలు కూడా యావరేజ్ గా 20 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు అవ్వడం విశేషం, అయినా కానీ గోపీచంద్ నటించిన సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కానీ అస్సలు ఫలించడం లేదు… ఆ సినిమా నే ఆరడుగుల బులెట్…

బి గోపాల్ డైరెక్షన్ లో గోపీచంద్ నయనతార ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా 4 ఏళ్ల క్రితమే కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాల్సింది కానీ రిలీజ్ అనుకున్న ప్రతీ సారి చివరి నిమిషంలో ఎదో ఒక అడ్డంకి రావడం సినిమా రిలీజ్ ఆగిపోవడం లాంటివి జరుగుతూ వస్తుండటం తో…

ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ పరంగా నిరాశనే మిగిలిస్తూ వస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ నుండి డిజిటల్ లో రిలీజ్ చేయాలని ట్రై చేసినా వచ్చిన రేట్లతో నిర్మాతలు సంతోషించక పోవడం తో మళ్ళీ రిలీజ్ ఆగిన ఈ సినిమా ఈ ఇయర్ లో కూడా…

ఆఫర్స్ వచ్చినా మళ్ళీ మేకర్స్ థియేటర్స్ లో సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా రిలీజ్ కి OTT డీల్ అడ్డుగా వచ్చిందని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఈ మధ్యనే సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఒక అగ్రిమెంట్ లో ఒక రేటుకి ఓకే చెప్పినట్లే చెప్పి తిరిగి మనసు మార్చుకున్నారు మేకర్స్… కానీ అగ్రిమెంట్ కి…

ఓకే చెప్పారు కాబట్టి సినిమా ఇక డిజిటల్ లోనే రిలీజ్ చేయాలనీ థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదు అంటూ ఆ OTT వాళ్ళు వాదిస్తున్నారట. దాంతో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో తెలియని స్థితిలో మేకర్స్ ఉన్నారట. ఆ డీల్ కి పెద్దగా రేటు కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ థియేటర్స్ లో బిజినెస్ ఆఫర్స్ కూడా ఆశించిన రేంజ్ లో రాలేదట. దాంతో మళ్ళీ సినిమా వ్యవహారం మొదటికి వచ్చింది అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment