గాసిప్స్ న్యూస్

4 కోట్ల జాతిరత్నాలు హిందీ రీమేక్ రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ చిన్న సినిమాల్లో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా జాతిరత్నాలు, మార్చ్ లాంటి అన్ సీజన్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మెస్మరైజింగ్ కలెక్షన్స్ తో అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని చిన్న సినిమాల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యాక మాత్రం…

రెస్పాన్స్ అంతంతమాత్రమే వచ్చింది, అమెజాన్ ప్రైమ్ వాళ్లకి సినిమా పై పెట్టిన డబ్బులలో చాలా తక్కువ మొత్తం రికవరీ అయ్యే రేంజ్ వ్యూవర్ షిప్ ను సినిమా సొంతం చేసుకుంది, మరో పక్క ఇవేవి పట్టించుకోకుండా ఇప్పుడు ఈ సినిమా కి తెలుగు లో ఒకపక్క…

సీక్వెల్ కథ సిద్ధం అవుతుంటే… సినిమా మరో పక్క బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి కూడా సిద్ధం అవుతుంది, లీడ్ రోల్ లో నవీనే అక్కడ నటించబోతున్నారని టాక్ ఉంది కానీ సినిమాను అక్కడ మరింత భారీ లెవల్ లో రూపొందించాలని చూస్తున్నారు. ఇక రీమేక్ రైట్స్ కింద సినిమా కి హిందీ లో…

సాలిడ్ రేటు కూడా సొంతం అయిందని అంటున్నారు. సినిమా రీమేక్ రైట్స్ కోసం ఏకంగా 2.3 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారట. ఓ చిన్న సినిమా రీమేక్ కి ఈ రేంజ్ రేటు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కానీ తెలుగు నిర్మాత నాగ్ అశ్విన్ కూడా హిందీ రీమేక్ లో భాగం అవ్వలాని చూస్తున్నారని సమచారం. అలా జరిగితే తాను కూడా…

హిందీ నిర్మాతలలో ఒకరు కావొచ్చు. కానీ దీనిపై ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉండగా మొత్తం మీద 4 కోట్ల లోపు బడ్జెట్ లో రూపొందిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రీమేక్ రైట్స్ తోనే సగానికి పైగా రేటు సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఈ సినిమా ఒకటిగా చేరింది.

Leave a Comment