న్యూస్ బాక్స్ ఆఫీస్

4 కోట్ల పెంగ్విన్…..శాటిలైట్ రైట్స్ తెలిస్తే షాక్!!

థియేట్రికల్ రిలీజ్ ఉండే పరిస్థితి ఎలా ఉండేదో కానీ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ పెంగ్విన్ కి డిజిటల్ రిలీజ్ వల్ల మంచి ప్రయోజనమే దక్కింది అని చెప్పాలి. సినిమా కి మిక్సుడ్ టాక్ ఉన్నా కానీ సౌత్ లోని అన్ని భాషల ఆడియన్స్ తో పాటు నార్త్ వాళ్ళు కూడా సినిమా ను సబ్ టైటిల్స్ తో విరగబడి చూస్తూ రీసెంట్ టైం లో డిజిటల్ రిలీజ్ సొంతం చేసుకున్న….

సినిమా లలో మోస్ట్ ట్రెండింగ్ మూవీ గా పెంగ్విన్ సినిమా ను నిలిపారు. ఇక నిర్మాతల పాయింట్ ఆఫ్ ఫ్యూ నుండి చూసుకుంటే సినిమా ను కేవలం 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే రూపొందించిన నిర్మాతలు కీర్తి సురేష్ క్రేజ్ దృశ్యా ఇతర భాషల్లో కూడా డబ్ చేశారు.

మొత్తం మీద డిజిటల్ రైట్స్ సినిమా కి 7.5 కోట్లు దక్కగా శాటిలైట్ రైట్స్ కూడా సాలిడ్ రేటు ని సొంతం చేసుకున్నాయి. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా కి శాటిలైట్ రైట్స్ కింద 6.4 కోట్ల రేటు దక్కినట్లు సమాచారం. దాంతో నిర్మాతలు మరింత హ్యాప్పీగా ఉన్నారని చెప్పొచ్చు.

సినిమా మొత్తం బాగానే ఆకట్టుకున్నా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లు అంచనాలను అందుకోలేక పోవడం తో మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఇక డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ తో పాటు సినిమా కి హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఇప్పుడు మంచి రేటు దక్కుతుందట…

బిజినెస్ ఆల్ మోస్ట్ 1.5 కోట్ల నుండి 2 కోట్ల మధ్యలో ఫినిష్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.. మొత్తం మీద సినిమా నిర్మాతలకు భారీ లాభాలను థియేట్రికల్ రిలీజ్ లేకుండా నే సొంతం చేసి పెట్టింది అని చెప్పాలి. ఇక ఇదే ఫార్ములా ని మరి కొన్ని సినిమాలు కూడా ఫాలో అవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు…

Leave a Comment