న్యూస్ బాక్స్ ఆఫీస్

4 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్…1 కోటి రావాలి…కానీ వచ్చింది ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వీకెండ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ నే చూపెట్టింది… నైజాంలో ఇంకాస్త బాగుంటే కచ్చితంగా సినిమా ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండి ఉండేది. ఇక వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర….

జోరు చూపెట్టాల్సిన అవసరం ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ ను రానున్న రోజుల్లో అందుకోవాలి అంటే వర్కింగ్ డేస్ లో ఎంత లేదన్నా 1 కోటి రేంజ్ కలెక్షన్స్ ని మినిమం సొంతం చేసుకోవాల్సిన అవసరం తో రోజును మొదలు పెట్టగా మొత్తం మీద…

బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 72 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టి అంచనాలను అందుకోలేక పోయింది. 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు డ్రాప్స్ 55% వరకు వచ్చాయి… ఈ లెక్కన సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.98Cr
👉Ceeded: 1.38Cr
👉UA: 87L
👉East: 71L
👉West: 40L
👉Guntur: 83L
👉Krishna: 41L
👉Nellore: 37L
Total AP TG: 6.95CR(11.35CR~ Gross)
👉KA+ROI: 27L(Corrected)
👉OS: 7L~(No release in USA)
TOTAL Collections: 7.29CR(12.10CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్….

సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేటు కి అమ్మగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 4.71 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. సినిమా ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఇంకా బాగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment