న్యూస్ స్పెషల్

4 సార్లు 100…యువ సామ్రాట్ ఊరమాస్ జోరు!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకుని దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అప్ కమింగ్ మూవీస్ అన్నీ అంచనాలను అందుకుంటే మరింత క్రేజ్ తో స్టార్ హీరోల లీగ్ లో ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక నాగ చైతన్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని మజిలీ సినిమా తో సొంతం చేసుకుని కెరీర్ లో ఫస్ట్ టైం…

40 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టొరీ సినిమా తో అతి త్వరలో బాక్స్ అఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పొచ్చు. ఇక నాగ చైతన్య కెరీర్ బెస్ట్ హిట్ మూవీ మజిలీ ఇక్కడ సాధించిన అల్టిమేట్ విజయం తర్వాత….

హిందీ లో కూడా డబ్ అయ్యి యూట్యూబ్ లో సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోయింది, రీసెంట్ గా ఈ సినిమా హిందీ డబ్ వర్షన్ 100 మిలియన్స్ మైలురాయి ని అధిగమించి సత్తా చాటుకోవడం విశేషం. దాంతో నాగ చైతన్య మూవీస్ లో ఈ సినిమా…

100 మిలియన్ మార్క్ ని అందుకున్న 4 వ సినిమా నిలిచి దుమ్ము లేపింది. ఇది వరకు నాగ చైతన్య మూవీస్ లో సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు, ప్రేమమ్ సినిమాలు 100 మిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు మజిలీ 4 సినిమా అయ్యింది. మొత్తం మీద ఇతర హీరోలతో పోల్చితే కొంచం స్పీడ్ కొంచం స్లోగానే ఉందని చెప్పాలి, కానీ నాగ చైతన్య మూవీస్ అక్కడ డబ్ అవ్వడం…

రీసెంట్ 1-2 ఇయర్స్ లోనే ఎక్కువగా జరుగుతూ ఉండగా ఇప్పటికే 4 సార్లు 100 మిలియన్ మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పొచ్చు. ఇక నాగ చైతన్య లవ్ స్టొరీ పై ఆడియన్స్ లో సాలిడ్ క్రేజ్ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా కెరీర్ బెస్ట్ రికార్డులతో జోరు చూపే అవకాశం ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.

Leave a Comment