గాసిప్స్ న్యూస్

4 సినిమాలతో రచ్చ చేయనున్న నాచురల్ స్టార్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో కొన్ని అపజయాలు ఎదురుకున్నా కానీ లాస్ట్ ఇయర్ చేసిన జెర్సీ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా వి ది మూవీ తో ఈ పాటికే రావాల్సి ఉన్నా లాక్ డౌన్ వలన ఆ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

ఇక ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని కమిట్ అయిన సినిమా లు మొత్తం మీద 4 ఉండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. లాక్ డౌన్ తర్వాత వరుస పెట్టి సినిమా లు చేయడానికి సిద్ధం అవుతున్నాడు నాచురల్ స్టార్ నాని.

అందులో ముందుగా మజిలీ డైరెక్టర్ శివ నిర్వాన తో టక్ జగదీశ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ ఇయర్ లోనే ఈ సినిమా రావాల్సింది కానీ ఇప్పుడు వచ్చే ఇయర్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తర్వాత రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ లో…

శ్యాం సింగ్ రాయ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు నాని, ఈ సినిమా ఆగిపోయిందని రీసెంట్ గా వార్తలు వస్తున్నా అదేమీ లేదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ లో రానుంది. ఇక తర్వాత కమిట్ అయిన మూవీ సుకుమార్ అసిస్టంట్ డైరెక్టర్ శ్రీకాంత్ వోడేల అనే కొత్త డైరెక్టర్ కథ ని ఓకే చేశాడు నాని.

ఈ సినిమా తో పాటు మెంటల్ మదిలో మరియు బ్రోచేవారెవరురా ఫేం వివేకాత్రేయ డైరెక్షన్ లో 29 వ సినిమా ను చేయబోతున్నాడు నాని. వి ది మూవీ తో కూడా కలుపుకుంటే మొత్తం 5 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.. పెద్ద డైరెక్టర్స్ ఈ లిస్టులో లేకున్నా కంటెంట్ ని నమ్ముకున్న నాని ఈ లిస్టులో ఉన్న సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి…

Leave a Comment