న్యూస్ బాక్స్ ఆఫీస్

4 డేస్ 160 కోట్లు..అరాచకం…థియేటర్స్ నుండి ఔట్?

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని 70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతున్న కోలివుడ్ స్టార్ హిరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు మాత్రం స్లో డౌన్ అయింది. దానికి తమిళనాడు లో సినిమా పై జరుగుతున్నా కాంట్రవర్సీ కూడా కారణం అని చెప్పొచ్చు.

అక్కడ ప్రభుత్వానికి అపోజిట్ గా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని కేసులు పెట్టడం, డైరెక్టర్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, సినిమా ఆడుతున్న థియేటర్స్ కొన్ని బంద్ చేస్తుండటంతో కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగానే పడింది అని చెప్పాలి.

కానీ ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక శని ఆదివారాలలో సినిమా కలెక్షన్స్ తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. కాగా సినిమాను తొలగించిన థియేటర్స్ లో తిరిగి ప్రదర్శితం చేయబోతున్నట్లు సమాచారం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!