న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

40 అనుకుంటే…ఇదేమి షాక్ సామి!

అ ఆ సినిమా తర్వాత వరుస పరాజయాలను ఎదురుకున్న నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్ళతో దూసుకు పోతూ క్లీన్ హిట్ గా నిలవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అనిపించుకుంది, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నితిన్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ గా నిలిచి ఊపిరి పీల్చేలా చేసింది..

సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే సరికి 27 కోట్ల మార్క్ ని అధిగమించి సత్తా చాటుకోగా ఇప్పుడు మూడో వీకెండ్ లో ఉన్న సినిమా మరీ అనుకున్న రేంజ్ గ్రోత్ ని ఏమీ సొంతం చేసుకోవడం లేదు, దానికి ప్రదాన కారణం అన్ సీజన్ అండ్ పరీక్షల సమయం అవ్వడం అని చెప్పాలి.

ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అవ్వడం లాంటివి కొంత ప్రతికూలంగా మారాయి ఈ సినిమా కి, సంక్రాంతి కో లేక సమ్మర్ లోనో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా కచ్చితంగా 40 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే సత్తా ఉన్న సినిమా గా…

సినిమా రిలీజ్ అయిన సమయం లో ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి, కానీ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఇది వరకు వచ్చిన మిర్చి, టెంపర్ లాంటి సినిమాలు 40 కోట్లు అవలీలగా దాటాయి కాబట్టి ఇప్పుడు పెరిగిన మార్కెట్ దృశ్యా బీష్మ కూడా 40 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేశారు అందరు.

కానీ సినిమా ఇప్పుడు అటూ ఇటూ గా 30 కోట్ల రేంజ్ లో షేర్ తో పరుగు ఆపే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఓవరాల్ గా సూపర్ హిట్ అయినా కానీ 40 కోట్ల మార్క్ అందుకునే సత్తా ఉన్న సినిమా ఇప్పుడు కేవలం 30 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో పరుగును ముగించబోతుండటం మాత్రం కొంత నిరాశ పరిచే అంశం అనే చెప్పాలి.

Leave a Comment