గాసిప్స్ న్యూస్

40 ఇయర్స్ తర్వాత ఆ రోల్ లో కమల్ హాసన్….అంచనాలు పెంచిన విక్రం!

లోక నాయకుడు కమల్ హాసన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ల టైం అవుతుంది…. తమిళ్ లో పాపనాశం సినిమా తో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నా కానీ తెలుగు లో కమల్ క్లీన్ హిట్ కి దశాబ్దం పైనే అవుతుంది. ఉన్నంతలో దశావతారం సినిమా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తర్వాత కమల్ నుండి వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అంచనాలను అందుకోలేక పోయింది, విశ్వరూపం సిరీస్ కూడా తెలుగు లో లాస్ నే మిగిలించాయి. ఇలాంటి టైం లో కమల్ హాసన్ నుండి అందరూ ఇండియన్ 2 కోసం ఆశగా ఎదురు చూశారు కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడం తో సడెన్ గా ఒక అయిన…

లొకేషన్ కనగారాజ్ డైరెక్షన్ లో మొదలైన విక్రం సినిమా పై టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెరిగిపోగా ఇక ఇందులో కమల్ తో పాటు విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ లాంటి నాచురల్ యాక్టర్స్ కూడా ఉండటం తో మరింత క్రేజ్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి.

ఇక ఈ సినిమా గురించిన ఓ లేటెస్ట్ న్యూస్ సినిమా పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది, ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఆల్ మోస్ట్ 40 ఏళ్ల క్రితం వేసిన అంధుడి రోల్ ని ఈ సినిమాలో మళ్ళీ వేయబోతున్నారని అంటున్నారు. కానీ అది సినిమాలో నిజంగానే అంధుడి రోల్ లా లేక కేవలం విలన్స్ ని అలా ఆటాడుకోవడానికి నటిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది…

40 ఏళ్ల క్రితం 1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అమావాస్య చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ అంధుడి రోల్ లో నటించారు. కమల్ హాసన్ నటన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాలో ఈ స్పెషల్ రోల్ తో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా కి తెలుగు లో ఇప్పటి నుండే ఆఫర్స్ కూడా వస్తుండటం విశేషం.

Leave a Comment