గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

40 కోట్ల బడ్జెట్….డైరెక్ట్ రిలీజ్ కి ఎంత ఆఫరో తెలిస్తే షాకవ్వాల్సిందే!!

బాలీవుడ్ ఇండస్ట్రీ మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే థియేట్రికల్ రిలీజ్ ల పరంగా ఏమాత్రం కోలుకోలేక పోయింది. మిగిలిన ఇండస్ట్రీలు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలను రిలీజ్ చేసి హిట్లు కొట్టిన వేల బాలీవుడ్ వాళ్ళు థియేటర్స్ లో జనాలు రాక పోవడం చూసి డిజిటల్ రిలీజ్ ల పైనే డిపెండ్ అయ్యి ఉన్నారు. డిజిటల్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలకు టాక్ కి అతీతంగా మంచి వ్యూవర్ షిప్ లభించడం కూడా…

వాళ్ళకి డిజిటల్ రిలీజ్ పై ప్రెజర్ పెడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉన్న తరుణం లో చాలా వరకు సినిమాల రిలీజ్ లు ఆగిపోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ రిలీజ్ కి బయపడుతున్న బాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ డిజిటల్ రిలీజ్ లపైనే…

డిపెండ్ కాబోతుంది. ఈ క్రమం లో కొన్ని క్రేజీ మూవీస్ కి ఆఫర్స్ సాలిడ్ గా వస్తూ ఉండగా కొన్ని సినిమాలకు చాలా తక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ఎక్కువ రేటు సొంతం చేసుకున్న సినిమాల్లో ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ బెల్ బాటం మూవీ ఉందని చెప్పాలి.

ఈ సినిమాను పాండమిక్ టైం లో కేవలం 40 కోట్ల బడ్జెట్ లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లాస్ట్ ఇయర్ నుండి జరుపుకుంటున్న ఈ సినిమా ను డిజిటల్ రిలీజ్ చేయాలని కోరుతూ లీడింగ్ OTT యాప్స్ సాలిడ్ రేట్లని ఆఫర్ చేస్తూ వస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా కి ఏకంగా 130 కోట్లకు పైగా…

రేటు డిజిటల్ రిలీజ్ కి గాను ఇచ్చారని సమాచారం. ఇది అల్టిమేట్ రేటు అనే చెప్పాలి. అసలు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వని ఈ సినిమా కి ఈ రేంజ్ రేటు ఆఫర్ అంటే చాలా పెద్ద విషయం, కానీ మేకర్స్ ప్రస్తుతానికి డిజిటల్ పై ఆలోచించడం లేదని త్వరలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave a Comment