న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

400 కోట్లతో చిరు రచ్చ…మెగాస్టార్ పేరుకున్న పవర్!

10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు… ఖైదీ నంబర్ 150 రిలీజ్ టైం లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల రేంజ్ లో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయగలడా లేదా అన్న అనుమానాలు రేకేత్తగా ఒక్క సారి సినిమా రిలీజ్ అయిన తర్వాత పోటి లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంటూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు కంబ్యాక్ తర్వాత చేసిన రెండో సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకోగా ఓవరాల్ గా సినిమా ఫైనల్ రన్ లో 143.8 కోట్ల షేర్ ని 236.43 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుని ఓవరాల్ గా ఫ్లాఫ్ అయినా…

టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాగా కంబ్యాక్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 2 సినిమాల కలెక్షన్స్ అందరికీ ఓవరాల్ గా షాక్ ఇస్తూ తాను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో చెప్పకనే చెబుతున్నాయి అని చెప్పొచ్చు.

ఖైదీ నంబర్ 150 మొత్తం మీద 104.6 కోట్ల షేర్ ని 164 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా ఇప్పుడు సైరా కలెక్షన్స్ తో కలిపి రెండు సినిమాలు కలిపి చూస్తె… 248.4 కోట్ల షేర్ అలాగే 400.43 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అంటే యావరేజ్ గా మెగాస్టార్ ఒక్క సినిమా కలెక్షన్స్ ఇప్పుడు…

అవలీలగా 124.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ 200 కోట్ల రేంజ్ లో ఉంటాయని అంచనా… ఇదే యావరేజ్ ఇప్పుడు కొరటాల శివ మూవీ తో కూడా అచీవ్ చేస్తే మరింత కాలం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మెగాస్టార్ రికార్డులకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. చిరు 152 వచ్చే ఇయర్ సమ్మర్ లో కానీ సెకెండ్ ఆఫ్ లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉందట.

Leave a Comment