టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

42 కోట్ల బడ్జెట్….కన్నడ వర్షన్ టోటల్ గా వచ్చింది ఇదీ…సెన్సేషన్ ఇదీ!!

ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు అనేక సినిమాలు పోటి పడీ మరీ రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి, కన్నడ ఇండస్ట్రీ లో కూడా ఈ ఇయర్ కొన్ని సినిమాలు కన్నడ వరకు మాత్రమే కాకుండా సౌత్ లో ఇతర చోట్ల కూడా డబ్ అయ్యి మార్కెట్ ఎక్స్ పాన్షన్ ను సొంతం చేసుకోగా మరీ అనుకున్న రేంజ్ సక్సెస్ ను అయితే సాధించలేదు కానీ సాంగ్స్ తో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుని…

రిలీజ్ అయిన పొగరు సినిమా మాత్రం ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. తెలుగు లో సినియా 4 కోట్ల టార్గెట్ కి 2.18 కోట్ల షేర్ ని అందుకోగా, తమిళ్ లో 45 లక్షల గ్రాస్ ను సాధించింది. ఇక సినిమా ఒరిజినల్ వర్షన్ కన్నడ లో ఎలాంటి కలెక్షన్స్ ను…

సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ లో సినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 42 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను కన్నడ లో కొన్ని చోట్ల ఓన్ గా కొన్ని చోట్ల బిజినెస్ కి అమ్మగా థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల దాకా ఉంటుందని…

అంచనా వేశారు ట్రేడ్ వర్గాలు. ఇక సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి కన్నడలో 48 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ను అలాగే 27 కోట్ల మేర షేర్ ను సొంతం చేసుకుందని సమాచారం. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 54.4 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా… అందులో షేర్ 31 కోట్ల వరకు ఉంటుందని చెప్పొచ్చు.

ఓవరాల్ టార్గెట్ లో కొంచం లాస్ దక్కింది ఈ సినిమా కి… అయినా కానీ ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి చేరువగా వెళ్ళిన ఈ సినిమా సెమీ హిట్ గా పరుగును అక్కడ ముగించింది… తెలుగు లో కూడా మిగిలిన కన్నడ డబ్ మూవీస్ తో పోల్చితే బెటర్ రిజల్ట్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ రికవరీ ని సాధించి దుమ్ము లేపింది ఈ సినిమా…

Leave a Comment