గాసిప్స్ న్యూస్

45 కోట్ల బ్లాక్ బస్టర్…రిలీజ్ అయిన 12 ఏళ్ల కి రీమేక్!

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో అల్టిమేట్ విజయాలను అందుకున్న ఓల్డ్ మూవీస్ చాలా ఉన్నాయి కానీ నేటి జనరేషన్ ని మాత్రం ఇలాంటి విజయాన్ని రుచి చూపించిన సినిమాలో ముందు నిలిచే సినిమా అరుంధతి అనే చెప్పాలి. 2009 లో సంక్రాంతి రేసులో ముందు అనుకున్న డేట్ కి రిలీజ్ కానున్నా కనుమ రోజున రిలీజ్ అయిన ఈ సినిమా అల్టిమేట్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.

సినిమా ఎవ్వరి ఊహకలను అందని విజయాన్ని నమోదు చేసి సంక్రాంతి సీజన్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించవచ్చో నిరూపించి చూపించింది. ఆ టైం లో ఏకంగా 35 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ని…

దక్కించుకుని దుమ్ము దుమారం చేసే విజయాన్ని నమోదు చేసుకుంది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ పై ఇతర ఇండస్ట్రీల కళ్ళు పడ్డా కానీ సౌత్ లో అన్ని చోట్లా డబ్ చేసి రిలీజ్ చేయగా టోటల్ కలెక్షన్స్ లెక్క 45 కోట్ల రేంజ్ కి చేరింది. ఇక హిందీ లో మాత్రం రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యారు అప్పుడే…

ఐశ్వర్యా రాయ్ తో రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోగా తర్వాత ఇప్పుడు 12 ఏళ్ళు పూర్తీ అయిన తర్వాత అల్లు అరవింద్ ఇప్పుడు ఈ సినిమా ను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. సినిమా బాలీవుడ్ రీమేక్ లో ఈ సారి దీపిక పదుకునే ని తీసుకోవాలి అని భావిస్తున్నారని సమాచారం. బడ్జెట్ పెంచి భారీ లెవల్ లో తీయాలని చూస్తున్నారు.

కానీ ఇప్పటికే అనేక భారీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకున్న దీపిక ఈ సినిమా చేస్తుందో లేదో అన్నది డౌట్ గా మారగా దీపిక దొరకని పక్షంలో మరో ఛాయిస్ గా ఆలియా భట్ లేదా శ్రద్ధా కపూర్ లు కూడా రేసులో ఉన్నారని తెలుస్తుంది. ఆల్ మోస్ట్ 12 ఏళ్ల తర్వాత రీమేక్ కి సిద్ధం అయిన ఈ సినిమా అక్కడ తెలుగు లో లా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు…

Leave a Comment