న్యూస్

45 లక్షలతో 16.8 కోట్లు…ఇప్పుడు సీక్వెల్…కానీ కొత్త ట్విస్ట్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమాలు చాలా తక్కువ, ఇక అప్పుడప్పుడు కొన్ని డబ్బింగ్ మూవీస్ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. అలాంటి సినిమాల్లో 2016 టైం లో ఎవరికీ పెద్దగా పరిచయం లేని విజయ్ ఆంథోని నటించిన బిచ్చగాడు అనే సినిమా అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి…

తెలుగు రైట్స్ ని కేవలం 45 లక్షల రేటు కి అమ్మితే బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ ఓ రేంజ్ లో పాజిటివ్ గా ఉండటం, ఆ టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడం సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన టాలీవుడ్ బిగ్ హీరోస్ మూవీస్ చేతులు ఎత్తేయడం తో ఈ సినిమా…

అన్ని అడ్వాంటేజ్ లు కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. సెన్సేషనల్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఏకంగా 16.8 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని ప్రాఫిట్స్ ను దక్కించుకుని సత్తా చాటుకుంది. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయిన….

5 ఏళ్లకి సీక్వెల్ ను అనౌన్స్ చేయగా సినిమా టైటిల్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమా కి డైరెక్టర్ గా ఎవరు ఉంటారు అన్నది ఆసక్తిగా మారగా కొందరి పేర్లు అనుకున్నా ఎందుకనో విజయ్ ఆంథోని అందరికీ షాకిస్తూ తానె ఈ సినిమా కి డైరెక్షన్ చేయబోతున్నానని కన్ఫాం చేశారు. తాను రాసుకున్న కథతో ఈ సీక్వెల్ ని…

తెరకెక్కించబోతున్నట్లు 2022 లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుందని పోస్టర్ లో కన్ఫాం చేశారు. మొదటి పార్ట్ సాధించిన విజయం వలన తమిళ్ లో కానీ తెలుగు లో కానీ ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు సాలిడ్ గానే ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ సార హార్ట్ టచింగ్ కాకుండా ఏమైనా హర్రర్ టచ్ ఇస్తున్నారా అనిపిస్తుంది. మరి సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment