న్యూస్ స్పెషల్

5 ఏళ్ల క్రితం సినిమా…ఇప్పుడు టెలికాస్ట్….నవ మన్మథుడు TRP రేటింగ్!!

ఈ మధ్య లాక్ డౌన్ వలన టెలివిజన్ లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేయాల్సి వచ్చింది, దాంతో లాక్ డౌన్ తర్వాత జనాలు చూడటానికి పెద్దగా సినిమాలు కూడా మిగలని పరిస్థితి నెలకొనగా ఛానెల్స్ వాళ్ళు ఓల్డ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యి టెలివిజన్ లో టెలికాస్ట్ కాకుండా ఆగిపోయిన సినిమాలలో కొన్ని తమకి నచ్చిన సినిమాలను వెతుకుతూ వాటిని కొంచం పబ్లిసిటీ చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తున్నారు.

ఈ రూల్ ఎక్కువగా ఇప్పుడు స్టార్ మా ఛానెల్ ఫాలో అవుతుంది అని చెప్పాలి. రీసెంట్ గా 4 ఏళ్ల క్రితం వచ్చిన ధనుష్ కీర్తి సురేష్ ల రైల్ సినిమాను వెతికి మరీ టెలికాస్ట్ చేసి మంచి TRP రేటింగ్ ని దక్కించుకోగా…

రెండేళ్ళ క్రితమే వచ్చిన మాస్ హిట్ కే.జి.ఎఫ్ ని రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు. ఇక ఇప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను టెలికాస్ట్ చేసి మరోసారి లాస్ట్ వీక్ మూవీస్ లో టాప్ 10 TRP రేటింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచేలా చేశారు. రఘువరున్ బి టెక్ తో తెలుగు లో మంచి విజయాన్ని అందుకున్న…

ధనుష్ అదే ఫార్మాట్ లో సమంత మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేసిన నవ మన్మథుడు సినిమా ను రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. అసలు ఈ సినిమా ను జనాలు పూర్తిగా మర్చిపోయారు అనే చెప్పాలి. రఘువరున్ ఫార్మాట్ లోనే వచ్చి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా…

టాక్ బాలెన ఫ్లాఫ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా స్టార్ మా టెలికాస్ట్ అవ్వగా సమంత క్రేజ్ కొద్దిగా హెల్ప్ అయ్యి సినిమా కి 3.2 TRP రేటింగ్ దక్కింది. సినిమా ను కూడా చాలా తక్కువ రేటుకే తీసుకోవడం జరిగిందట. ఆ లెక్కన ఈ సినిమా కూడా చానెల్ కి మంచి ప్రాఫిటబుల్ మూవీ అనే చెప్పాలి…

Leave a Comment