గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

5 ఏళ్ళకి ఫస్ట్ హిట్…ఇప్పుడు బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ కి రెమ్యునరేషన్ ఇదే!!

2014 లో అల్లుడు శీను సినిమా తో కెరీర్ ని మొదలు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఆ సినిమా హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు, తర్వాత జయ జానకి నాయక కూడా ఇలాంటి పరిస్థితి నే ఎదురుకోగా క్లిన్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బెల్లం కొండ కి ఎట్టకేలకు 5 ఏళ్ళకి 2019 లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ దక్కింది.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమా ను తెలుగు లో రాక్షసుడు పేరు తో రీమేక్ చేయగా సినిమా కమర్షియల్ గా బెల్లంకొండ కెరీర్ లో మొట్ట మొదటి క్లీన్ హిట్ మూవీ గా నిలవగా ఇప్పుడు బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాను కంప్లీట్ చేసి…రిలీజ్ కి సిద్ధం చేయగా…

ఇప్పుడు బెల్లం కొండ కి మళ్ళీ మంచి డిమాండ్ ఏర్పడగా ఒక్కో సినిమా రెమ్యునరేషన్ పరంగా కూడా రేటు అమాంతం పెంచేశాడని టాక్ వినిపిస్తుంది, తెలుగు లో కొన్ని సినిమాలు కమిట్ అయినప్పటికీ కూడా హిందీ లో రీసెంట్ గా ప్రభాస్ ఛత్రపతి సినిమా రీమేక్ లో నటిస్తున్న బెల్లంకొండ….

భారీ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది, అల్లుడు అదుర్స్ సినిమాకి గాను 7 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ ఉండగా…ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ కోసం ఏకంగా 10 కోట్లకు తగ్గని రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా…

హిందీ డబ్బింగ్ మూవీస్ తో అక్కడ అన్ని సినిమాలకు సాలిడ్ గా వ్యూస్ దక్కుతున్న నేపధ్యంలో ఈ రేంజ్ రేటు పెట్టడం ఏమాత్రం తక్కువ కాదని అంటున్నారు. త్వరలోనే సెట్స్ పై కి వెళ్ళబోతున్న ఈ సినిమా కి ఇప్పటి నుండే క్రేజ్ పెరుగుతుంది….మిగిలిన హీరోలు ఇక్కడే సరిపెడుతుంటే బెల్లంకొండ బాలీవుడ్ లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు.

Leave a Comment