న్యూస్

5 రోజులు బాక్స్ ఆఫీస్ జాతర ఖాయం….కానీ!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉండగా అల్టిమేట్ ప్రాజెక్టులు ఒక్కొటిగా సెట్ చేస్తూ ఫ్యాన్స్ కి తిరుగు లేని కిక్ ఇస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని సాహో లాంటి ఫ్లాఫ్ మూవీ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి సత్తా చాటుకున్న ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ తో వచ్చే ఇయర్ సమ్మర్ లో దుమ్ము లేపబోతున్నాడు.

ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా కమిట్ అయిన ప్రభాస్ ముందు ఈ సినిమానే త్వరగా మొదలు పెడతాడు అనుకున్నా సడెన్ గా బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ఆది పురుష్ రావడం తో ఫోకస్ ఆ సినిమా కి షిఫ్ట్ అయింది.

కాగా ఈ సినిమా కి సంభందించిన అప్ డేట్స్ అడపా దడపా వస్తూనే ఉండగా రీసెంట్ గా ఏకంగా సినిమా రిలీజ్ డేట్ నే కన్ఫాం చేశారు యూనిట్, 2022 లో ఆగస్ట్ 11 న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని కన్ఫాం చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇంకా షూటింగ్ మొదలే కాని సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం బాలీవుడ్ లో కామనే, ఇక రిలీజ్ డేట్ కూడా అల్టిమేట్ లెవల్ లో ఉందనే చెప్పాలి. ఆగస్ట్ 11 రాఖీ పండగ, 12 రెగ్యులర్ శుక్రవారం కాగా, 13 సెకెండ్ శనివారం, 14 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం నేషనల్ హాలిడే… అంటే 5 రోజుల లాంగ్ వీకెండ్ తో రిలీజ్ కాబోతుంది ఆది పురుష్ సినిమా…

సినిమా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో రీచ్ ని సొంతం చేసుకుంటే ఈ 5 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ ఇండియా లెవల్ లో ఊహకందని కలెక్షన్స్ సునామీ సృష్టించే అవకాశం ఉంది, ఎటొచ్చి ప్రభాస్ రీసెంట్ మూవీస్ లో లేట్ అవ్వకుండా ఉంటె చాలు, డైరెక్టర్ ఓం రౌత్ తక్కువ టైం లో సినిమాలు కంప్లీట్ చేస్తాడు అన్న పేరు ఉంది, ఇప్పుడు నిలబెట్టుకుని మంచి ఔట్ పుట్ ఇస్తే ప్రభాస్ తన స్టామినాతో బాక్స్ ఆఫీస్ ఊచకోత పవర్ చూపించడం ఖాయం…

Leave a Comment