న్యూస్ బాక్స్ ఆఫీస్

5 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్…సైరా సెన్సేషనల్ AP TG కలెక్షన్స్!!

మొదటి రోజు తప్పితే మిగిలిన 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో స్టడీ కలెక్షన్స్ వస్తున్నా మరీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రావడం లేదు అంటూ అందరు ఆశగా ఎదురు చూస్తున్న తరుణం లో సైరా నరసింహా రెడ్డి కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సండే హాలిడే లభించడం తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలన కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది.

టాలీవుడ్ హిస్టరీ లో 5 వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుని సైరా నరసింహా రెడ్డి సంచలనం సృష్టించింది. ఇది వరకు బాహుబలి 2 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 11.35 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత ఏ సినిమా కూడా …

6 కోట్లకు పైగా షేర్ ని అందుకోలేదు, మొదటి పార్ట్ కూడా 6 కోట్ల లోపే షేర్ ని అందుకుంది, కానీ ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి 5 వ రోజు మినిమమ్ 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకున్నా ఏకంగా 8 కోట్ల మార్క్ ని అందుకుని 8.33 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది.

5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల సైరా నరసింహా రెడ్డి షేర్స్ ని గమనిస్తే
👉Nizam: 2.48Cr
👉Ceeded: 1.80Cr
👉UA: 1.38Cr
👉East: 57L
👉West: 35L
👉Guntur: 73.7L
👉Krishna:71L
👉Nellore: 30L
AP-TG Day 5:- 8.33Cr ఇదీ సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ భీభత్సం…

5 వ రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించిన సైరా సినిమా ఇప్పుడు సోమవారం నుండి బుదవారం వరకు హాలిడేస్ ఉండటం తో ఈ మూడు రోజులు ఇలాంటి సెన్సేషనల్ వసూళ్లు సాధిస్తే మిగిలిన చోట్ల నష్టాలను కొద్ది వరకు పూడ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఇక 5 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలను కొద్ది సేపట్లో అప్ డేట్ చేస్తాం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!