న్యూస్ బాక్స్ ఆఫీస్

5 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్

ఈ వీకెండ్ టాలీవుడ్ లో ఏకంగా 5 సినిమాలు సందడి చేసిన విషయం తెలి సిందే…వేటి కవే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాల రేంజ్ కి తగ్గట్లు పెర్ఫార్మ్ చేశాయి. కాగా మొదటి రోజు మొత్తం మీద ఈ 5 సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ని ఒకసారి తెలుసు కుందాం పదండీ.. ముందుగా పడి పడి లేచే మనసు విషయానికి వస్తే…

మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ జోరు అందుకున్న కారణంగా మూడు కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందని అంచనా వేసినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాల దృశ్యా సినిమా గ్రోత్ చూపలేకపోయింది. దాంతో తొలిరోజు 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక అంతరిక్షం సినిమా పూర్తిగా ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడంతో అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయింది. ఉన్నంతలో సినిమా మల్టీ ప్లెక్సులలో పర్వాలేదు అనిపించగా తొలిరోజు సుమారు 1.5 కోట్లకి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కే.జి.ఎఫ్ తెలుగు లో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కానీ సినిమా రిలీజ్ థియేటర్స్ తక్కువ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు ఈ సినిమా 50 లక్షల కి పైగా షేర్ ని అందుకోవచ్చు.

ఇక ధనుష్ నటించిన మారి 2 వీక్ ప్రమోషన్స్ కారణంగా స్లో స్టార్ట్ ని సొంతం చేసుకున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటం తో మెల్లిగా పుంజుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా తొలిరోజు 40 లక్షల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక షారుఖ్ ఖాన్ నటించిన జీరో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ షాక్ నే ఇచ్చింది. అల్టిమేట్ బజ్ ఉన్నా సినిమా అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేక పోయింది. దాంతో తొలిరోజు ఇండియా వైడ్ గా సినిమా 20 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది. ఆఫ్ లైన్ లో జరిగే టికెట్ సేల్స్ ని బట్టి ఈ సినిమాల కలెక్షన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!