గాసిప్స్ న్యూస్

50 కోట్లకు…వచ్చింది కోటి…ఇప్పుడు సినిమా చూసి ట్రోల్ చేస్తున్నారు!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని బొక్క బోర్లా పడ్డవి చాలానే ఉన్నాయి, కానీ చాలా వరకు సినిమాలకు ఎంతో కొంత బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్ నుండి సినిమాలకు నష్టాలు వచ్చాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలు వచ్చాయి, అలాంటి సినిమాల్లో ముందు నిలిచే సినిమా మంచు విష్ణు మరియు కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో…

రూపొందిన లేటెస్ట్ మూవీ మోసగాళ్ళు ముందు నిలిచే సినిమా అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చి నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ను మొత్తం మీద 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీ ఎత్తున రూపొందించారు. కానీ సినిమా ను కొనడానికి ఎవ్వరూ కూడా…

ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఎలాగోలా సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని అమ్మిన తర్వాత మిగిలిన మొత్తం సినిమా బిజినెస్ గా మారి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయితే టోటల్ రన్ లో సినిమా కేవలం 1 కోటి మాత్రమే వసూల్ చేసింది.

50 కోట్లు పెడితే కేవలం కోటి షేర్ ని మాత్రమే రాబట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ గా నిలవగా లేటెస్ట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన 3 నెలల లోపు టైం తీసుకుని రిలీజ్ అయిన ఈ సినిమాను అప్పుడు చూడని వాళ్ళు చూసి లాస్ట్ 15 నిమిషాలు తప్పితే…

సినిమా లో ఏమి లేదంటూ సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ సరిగ్గా తీయలేక పోయారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా కి ఈ రిజల్ట్ కరెక్టే అని కూడా అంటున్నారు. మొత్తం మీద సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రోల్ అయింది ఇప్పుడు డిజిటల్ రిలీజ్ లో కూడా ట్రోల్ అవుతుంది అని చెప్పొచ్చు…

Leave a Comment